బావాబావమరుదులు పోటాపోటీగా..?

ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మంది హీరోలు మరే ఫ్యామిలీ నుండి రాలేదంటే అతిశయోక్తి ఉండదు. అంతమంది మెగాస్టార్ చిరు నీడ కింద ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇకపోతే మెగా ఫ్యామిలిలో సఖ్యత ఎంత ఉందొ.. విభేదాల విషయంలోనూ ఎంతోకొంత ఉంది. దానికి సాక్ష్యముగా చాలాసార్లు చాలానే వార్తలు వినబడ్డాయి. అందులో మచ్చుకు మెగా ఫ్యామిలీ అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ కూడా వచ్చే వాడు. కాని ఇప్పుడు బయట మెగా ఫాన్స్ ఇంకా అల్లు ఫాన్స్ అంటూ సేపెరేట్ గా డివైడ్ అయ్యి గొడవలు పెట్టుకుంటున్నారు. దీనికి సోషల్ మీడియానే ప్రత్యక్ష సాక్షి.
ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసి అందులో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ కి పోటిగా ఒక ప్రొడక్షన్ హౌస్ ని పెట్టాలి అని డిసైడ్ అయ్యాడట. అవును అల్లు అర్జున్ సొంతంగా బ్యానర్ ఆరంభించి నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని అనుకుంటున్నట్లుగా టాక్ బయటికి వచ్చింది. అందులో భాగంగా అను.కే.రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ పట్ల ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్, ఆ స్క్రిప్ట్ తో తన సొంత బ్యానర్ లో మూవీ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా లాంచ్ అవ్వాలి అనుకుంటున్నాడట.
ప్రస్తుతం 'నా పేరు సూర్య, నా ఇళ్ళు ఇండియా' మూవీ షూటింగ్ తో బిజీ గా ఉన్న అల్లు అర్జున్.. ఆ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అయ్యాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి ఆలోచిస్తాడు అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సొంత ప్రొడక్షన్ లో మూవీ ని స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడట అల్లు అర్జున్

