బాలీవుడ్ హాటెస్ట్ జంట ఇలా

బాలీవుడ్ లో ఎంతో పాపులర్ అయిన ప్రేమికులు జంట దీపికా పదుకొనె - రణ్వీర్ సింగ్ లు. వీరిద్దరూ ఏళ్లతరబడి ప్రేమించుకుంటున్నారు కానీ పెళ్లి ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వరు. అలాగే బాలీవుడ్ మీడియాలో వారు ఒకసారి కలిసున్నారని... ఒకసారి విడిపోయారని వార్తలొస్తాయి కూడా. కానీ వీళ్లిద్దరి ప్రేమ జంట అందరికి చూడముచ్చటగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వీరిద్దరూ కలిసి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టుగా వార్తలయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే బాలీవుడ్ లో తాజాగా జరిగిన హలో - హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2018 అవార్డు ఫంక్షన్ లో ఈ జంట మధ్య కెమిస్ట్రీ ఎలా పండిందంటే....
రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె వేర్వేరుగా ఈ ఫంక్షన్ కి హాజరయిన కూడా వీరిద్దరూ ఆ ఫంక్షన్ కి వచ్చాక చేయించుకున్న ఫోటో షూట్ ఉంది చూడండి... అబ్బబ్బ భలే ఉందంటే నమ్మండి. దీపికా అయితే తెల్లటి గౌన్ లో క్లివేజ్ షో తో పోత పోసిన అందంలా పొడుగు కాళ్ళ సుందరిలా దర్శనమిస్తే... ఎప్పుడు యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా వుండే రణ్వీర్ కూడా హ్యాండ్ సోమ్ లుక్ తో ఇద్దరు కిర్రాక్ పుట్టించారు. మరి అందాల ఆరబోతతో దీపికా.... ఎనర్జిటిక్ గా రణ్వీర్ లు రెచ్చిపోయి హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేయించుకుని హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఈ హలో - హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2018 వీరిద్దరి జంట అందరికన్నా హైలెట్ గా నిలిచింది.


