బాలయ్యపై సెటైర్ వేశాడా?

మన సినిమాలు గురించి కానీ మన హీరోస్ గురించి కానీ వేరే భాషకి చెందిన సినీ ప్రముఖులు కామెంట్స్ చేస్తే మనకి అంతగా నచ్చదు. ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పై తమిళ్ కమెడియన్ వివేక్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ మీడియా లో వైరల్ అవడమే కాకుండా ప్రేక్షకులని కూడా ఆశ్చర్యపరిచింది.
90ల చివరి నుంచి ఓ దశాబ్దం పాటు తమిళ సినిమాల్లో కమెడియన్గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వివేక్.. ఈ విధంగా ఒక సెన్సేషనల్ ట్వీట్ చేసాడు... ఏదైనా బాధలో ఉంటే రెండు పనులు చేస్తాను..ఒకటి స్వామి వివేకానంద పుస్తకాలు చదవడం..రెండోది బాలకృష్ణ సార్ డైలాగులు, ఫైట్లు చూడటం అని వివేక్ చేసిన ట్వీట్ ఇప్పుడు నందమూరి ఫాన్స్ ని గందరగోళంలో పడేశాయి. ఈ రెండు చేస్తే తనకు ఎనర్జీ ఇస్తాయని వివేక్ వ్యాఖ్యానించాడు.
వివేక్ ఇలా ట్వీట్ చేయటం వల్ల టాలీవుడ్ షాక్ అయింది. బాలయ్యకు సంబంధించిన కొన్ని డైలాగులు.. స్టంట్లపై ఒకప్పుడు పెద్ద ఎత్తున జోకులు పేలిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకుని వెటకారంగా ఏమైనా వివేక్ ఈ ట్వీట్ పెట్టాడా అని కొందరు సందేహించారు. అందులో నందమూరి అభిమానులు కూడా ఉన్నారు. కానీ కొందరు వివేక్ లాంటి నటుడు బాలయ్యని అనే అంత సీన్ లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య సినిమాలు చూసి.... బాలయ్య ఎనర్జీ పొందుతున్నారంటే గొప్ప విషయమే కదా.

