Mon Apr 29 2024 00:59:03 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్య సొంత ఊళ్ళో హంగామా
సొంత ఊళ్ళో బాలయ్య సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 100చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ తో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న బాలకృష్ణ.., గౌతమీ పుత్రపై సంతోషం వ్యక్తం చేసారు. అమ్మవారి దర్శనం తర్వాత నేరుగా నందమూరి బసవ తారకం పుట్టినిల్లు కోమరవోలు వెళ్ళారు. గ్రామంలో నందమూరి తారక రామారావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎడ్ల బండిపై గ్రామంలో సవారీ చేస్తూ అందర్నీ పలకరించారు. మధ్యాహ్నం నుంచి బాలయ్య ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకురులో విడిది చేయనున్నారు. బాలయ్య రాక సందర్భంగా భారీగా భద్రత ఏర్పాటు చేసారు.
Next Story