బాలయ్య గత ఎన్నికల సెంటిమెంట్ ని నమ్ముకున్నాడా?

నట సింహం నందమూరి బాల కృష్ణ వరుస పరాజయాలతో మార్కెట్ కోల్పోయిన కాలంలో సింహ వంటి బ్లాక్ బస్టర్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య స్టామినా రుజువు చేసే చిత్రం ఇచ్చి బాలయ్య అభిమానులకి బాగా చేరువయ్యాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆ తరువాత కాలంలో సరిగ్గా 2014 ఎన్నికల సమయంలో శాసన సభ్యుడిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగిన బాలయ్య కి ప్రచారానికి ఉపయోగపడే అంశాలని, సంభాషణల్ని జోడించి లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఇచ్చి మరొక సారి నందమూరి అభిమానవులకి చేరువయ్యారు బోయపాటి శ్రీను.
లెజెండ్ విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మరో వైపు ఏడాది దూరంలో శాసన సభ ఎన్నికలు కూడా వున్నాయి. ఈ సమయంలో జై సింహ అనంతరం బాలయ్య చేయబోయే ఎన్.టి.ఆర్ బైయోపిక్ తో పాటు తన తరువాత ప్రాజెక్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ఉంటుందని జై సింహ ప్రీ రిలీజ్ విడుదల వేదికగా సంకేతాలు ఇచ్చారు. బాలయ్య, బోయపాటి ల సినిమాల వరుస చూస్తుంటే ఈ చిత్రం 2019 ఎన్నికలకి ముందు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

