బాలకృష్ణ గెస్ట్ గా వస్తే...?

'భలే మంచి రోజు'తో హిట్టు కొట్టిన శ్రీరామ్ ఆదిత్య ఇప్పుడు నలుగురు యువ హీరోలతో 'శమంతకమణి' అనే మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యిందని చెబుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న చిత్ర యూనిట్ ఇప్పుడు పబ్లిసిటీని టార్గెట్ చేసింది. మొన్న టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన ఈ చిత్రం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో మరోసారి ఆకట్టుకుంది. సందీప్ కిషన్, నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది కలిపి నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
అసలు ఇద్దరు హీరోలు కలిసి నటించడమే గగనమనుకొనే ఈ రోజుల్లో ఏకంగా నలుగురు హీరోలు కలిసి నటించడమంటే మాటలు కాదు. కథలో ఎంతో బలముంటే తప్ప హీరోలు అలా కలిసి నటించడానికి ఒప్పుకోరు. 'భలే మంచి రోజు'తో హిట్టు కొట్టిన శ్రీరామ్ ఆదిత్య రాసిన స్క్రిప్టువల్లే శమంతకమణి కోసం నలుగురు హీరోలు చేతులు కలిపారని చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రానికి సంబందించిన పబ్లిసిటీలో భాగంగా 'శమంతకమణి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 3 వ తేదీన హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించబోతున్నారట. అయితే ఈ వేడుకకి ముఖ్య అతిధిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నాడని సమాచారం.
మరి నందమూరి బాలకృష్ణ. నారా రోహిత్ కి వరసకు మామ కదా అందుకే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడని అనుకోకండి. బాలకృష్ణ ఈ ఫంక్షన్ కి రావడానికి కారణం భవ్య ప్రొడక్షన్స్ వారట. 'శమంతకమణి' ని నిర్మించేది ఈ భవ్య ప్రొడక్షన్స్ సంస్థ కావడం బాలకృష్ణ పూరి కాంబోలో తెరకెక్కే 'పైసా వసూల్' నిర్మాతలు కూడా భవ్య ప్రొడక్షన్స్ వారు కావడంతో నిర్మాతల ఆహ్వానం మేరకే బాలకృష్ణ ఈ వేడుకకి హాజరవుతున్నాడట. మరి బాలకృష్ణ వంటి హీరో ఈ బుల్లి మల్టీస్టారర్ చిత్ర ఈవెంట్ కి రావడంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరికిపోతాయంటున్నారు.

