బాబోయ్.. పద్మావతి ఏమిటిది?

దీపికా - షాహిద్ కపూర్ - రణ్వీర్ సింగ్ నటించిన పద్మావతి చిత్రం ప్రస్తుతం అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. సంజయ్ లీల బన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కిన పద్మావతి చిత్రం మీద అనేక గొడవలు జరుగుతున్నాయి. అసలు ఈ సినిమా సెన్సార్ కష్టాలతో... డిసెంబర్ 1 న విడుదలవుతుందా? అనేది పెద్ద డౌట్. ఎందుకంటే చిత్ర బృందం తమ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లుగా చెబుతుంది. అలాగే పద్మావతి పాత్ర చేసిన దీపికను, దర్శకుడు సంజయ్ లీల బన్సాలీలను చంపేస్తామంటూ బెదిరింపులు కూడా ఉన్నాయి. అలాగే వారి తలలకు 10 కోట్లు వెల కూడా కట్టిన సంగతి తెలిసిందే. అందుకే దీపికా ఎక్కడికి వెళ్లాలన్నా కాస్త భయంతో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానాన్ని కూడా సున్నితంగా తిరస్కరించింది దీపికా. ఇక ముంబై లో ఆమె నివాసం వద్ద పోలీసులను నియమించి దీపికకు కట్టుదిట్టమైన భద్రతను నియమించింది ప్రభుత్వం.
ఇలాంటి పరిస్థితుల్లో దీపికా పదుకునే హాట్ హాట్ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అంటే దీపికా పద్మావతిని లైట్ తీసుకుందా? అనే అనుమానం వచ్చేస్తుంది ఆ ఫొటోస్ చూస్తుంటే. అయితే దీపికా ఆ హాట్ ఫోటో షూట్ ని ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కోసం చేయించుకుంది. ఐలాండ్లో ఫిలింఫేర్ కోసం దీపికా ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బికినీకే బాప్ అన్నట్టుగా దీపికా వేసిన హాట్ డ్రెసులు చూస్తుంటే అబ్బాయిలకు కాదు... అమ్మాయిలకే మతులు పోయేలా వున్నాయి.
మరి పొడుగు కాళ్లతో బికినీ వేసి... స్విమ్ సూట్ లో కైపెక్కిస్తున్న దీపికా ని ఇలా చూస్తుంటే మాత్రం.. అమ్మడు పద్మావతి వ్యవహారాన్ని లైట్ తీసుకుందనుకోవాలా? అసలు పద్మావతిలో రాజపుత్ర మహారాణిలా సూపర్ గా కనబడిన దీపికా పదుకొనె ఇప్పుడు ఇలా మతులుపోగొట్టే హాట్ అండ్ గ్లామర్ షో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

