బాబోయ్ ఒక్కసారిగా లుక్ లో ఇంత మార్పా?

చిత్ర పరిశ్రమలో కథానాయికలకు వుండే కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఇంత తక్కువ స్పాన్ లో కూడా పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని తట్టుకుని ప్రేక్షకులకి మొహం మొత్తకుండా తగు జాగ్రత్తలతో తమ అవకాశాలని మెరుగు పరచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రేక్షకుడికి నిరంతరం తమని తాము సరికొత్తగా చూపించుకోవటానికి కథానాయికలు చేసే మేక్ ఒవర్స్ కోసం రకరకాల ఆధునిక మేకప్ పరికరాలని, హెయిర్ స్టయిలింగ్స్ ని నమ్ముకుంటుంటారు. ఇలాంటి ఒక ప్రయత్నంతోనే కన్నడ చిత్ర పరిశ్రమలో బిజీగా వున్న సంజన గల్రాని అందరికి షాక్ ఇచ్చింది.
కొత్త హెయిర్ స్టయిల్ తో....
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బుజ్జిగాడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన సంజన గల్రాని తనని తాను కొత్తగా ప్రదర్శించుకోవటానికి చేసుకున్న స్కిన్ టోన్ మేకప్ తో పాటు అధిక మోతాదు లో వాడైనా కాజల్, లిప్ స్టిక్ మరియు షార్ట్ చేసిన హెయిర్ స్టయిల్ తో సోషల్ మీడియా ద్వారా తన లేటెస్ట్ లుక్ ని తానే స్వయంగా పంచుకుంది. అయితే ఈ లుక్ ఎంతమందిని ఆకర్షించిందో తెలియదు కానీ కామెంట్స్ ని పరిశీలిస్తే అధిక మంది ఫాలోయర్స్ కి ఎబెట్టుగా అనిపించిందని మాత్రం అర్ధం అవుతుంది
- Tags
- సంజన గల్రాని

