బాగానే పుంజుకుందండోయ్

భారీ నిర్మాతల కొడుకులు తమ తమ సినిమాలతో ఒకేరోజు బరిలోకి దిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరున్న నిర్మాతలైన సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, బెల్లంకొండ సురేష్ ల కొడుకులు రానా, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లు 'నేనే రాజు నేనే మంత్రి, లై, జయ జానకి నాయక' చిత్రాలతో థియేటర్స్ లోకి వచ్చేసి కలెక్షన్స్ కొల్లగొట్టేయ్యాలనే ప్లాన్ చేశారు. కానీ నిర్మతల కొడుకులైతే పోటీకి దిగారు గాని ఆయా నిర్మాతలైయినా కొంచెం తగ్గాల్సింది. వారు కూడా కొడుకుల నిర్ణయానికి సై అన్నారు. మరి సురేష్ బాబు గట్టి నిర్మాత కాబట్టే తన కొడుకు రానా నటించిన నేనే రాజుకు కావాల్సిన థియేటర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెచ్చుకున్నాడు.
అలాగే 'లై' చిత్రానికి కూడా కావాల్సిన థియేటర్స్ దొరక్కపోయినా కొంచెం పర్లేదనిపించేలా వున్నాయి. ఇక మిగిలిన బెల్లంకొండ సురేష్ కొడుకు నటించిన 'జయ జానకి నాయక' కి మాత్రం థియేటర్స్ కొరత గట్టిగానే ఏర్పడి ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడింది. లేకుంటే 'నేనే రాజు నేనే మంత్రి' కంటే 'జయ జానకి నాయక'కే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవని ట్రేడ్ నిపుణుల అంచనా వేశారు. కానీ వారికి దాదాపు వందకు పైగా థియేటర్లు తగ్గాయని స్వయంగా 'జయ జానకి నాయక' డైరెక్టర్ బోయపాటి చెప్పాడు. అయితే బోయపాటి చెపింది నిజమే. సరిగ్గా వారం తిరిగేసరికి ఆ వంద థియేటర్లు 'జయ జానకి నాయక' కోసం రికవరీ అయ్యాయి.
బోయపాటి తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ బిసి సెంటర్స్ లో సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి మొదటి వారం కావాల్సిన థియేటర్స్ లేక కొంచెం కలెక్షన్స్ విషయంలో వెనకబడిన 'జయ జానకి నాయక' ఇప్పుడు సెకండ్ వీక్ లో 100 థియేటర్స్ పెరగడంతో దానితో పాటే కలెక్షన్స్ కూడా పెరుగుతాయనే ధీమాలో చిత్ర టీమ్ వుంది. ఇక రెండో వారంలో కూడా కొద్దో గొప్పో ఈ మూడు సినిమాలే థియేటర్స్ లో పోటీకి ఉన్నాయి. కాకపోతే గత శుక్రవారం వచ్చిన ఆనందో బ్రహ్మ మాత్రం చిన్న సినిమాగా కొద్దీ థియేటర్స్ లో మాత్రమే విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

