బాక్సాఫీస్ కు మెగాస్టార్ ‘స్వీట్ వార్నింగ్’

మెగాస్టార్ చిరంజీవి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకూ ఎవరికో తెలుసా? టాలీవుడ్ బాక్సీఫీస్ కు! బాక్సాఫీస్ ను ఎరీనాగా చేసుకుని తనతో తలపడాలని అనుకుంటున్న వారికి కూడా ఇందులో ఒక స్వీట్ వార్నింగ్ దాగి ఉన్నదేమో తెలియదు. మొత్తానికి అభిమానులు మాత్రం ఈ స్వీట్ వార్నింగ్ ను మహదానందంగా పుచ్చుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న కమ్‌బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 టీజర్ గురువారం విడుదల అయింది. ఈ టీజర్లో మెగాస్టార్ ఉన్న స్టయిలిష్ ఎప్పియరెన్స్ చూసి అభిమానులకు మైండ్ బ్లాక్ అవుతోందిట. అప్పియరెన్స్ ఒక ఎత్తు అయితే.. ‘‘నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తే.. కాదని బలవంతం చేస్తే, కోస్తా’’ అంటూ మెగాస్టార్ చెప్పే పంచ్ డైలాగ్ జనానికి కిర్రెక్కిస్తోంది.
35 సెకన్ల టీజర్ కు ముగింపుగా.. మెగాస్టార్ ‘‘ఇది స్వీట్ వార్నింగ్’’ అనడంలో అభిమానులు చాలా అర్థాలు వెతుక్కుంటున్నారు. మెగాస్టార్ చెబుతున్న డైలాగుకు అభిమానులు ఎవరికి తోచినట్లు వారు భాష్యం చెప్పుకుంటున్నారు. సంక్రాంతి బాక్సాఫీసుకే మెగాస్టార్ వార్నింగ్ ఇస్తున్నారని అనుకుంటున్నారు. మెగాస్టార్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం టీజర్, అభిమానులకు ఇంకా ఏదో కావాలి అనిపించేలా ఉన్నా.. మామూలు ప్రేక్షకులకు బాగానే రీచ్ అయినట్లుంద.

