బాక్సాఫీసు లూటీకి మళ్లీ రానున్న బిచ్చగాడు

బిచ్చగాడు గా ఓ వెరైటీ కథతో తీసిన చిత్రం ద్వారా అనూహ్యమైన విజయం సాధించిన సైలెంట్ కిల్లర్ విజయ్ ఆంటోనీ. తమిళ చిత్రాల డబ్బింగ్ లు తెలుగు థియేటర్లను ఏలుతున్న సమయంలో.. చాలా మంది తెలుగు స్టార్ హీరోల చిత్రాలకంటె ఈ విజయ్ ఆంటోనీ బిచ్చగాడు హిట్ అయిందంటి అబద్ధం కాదు. ఈ చిత్రానికి విజయ్ హీరో మాత్రమే కాకుండా నిర్మాత కూడా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో మొత్తం ప్రాజెక్టు భారాన్ని తన భుజాన మోశాడో అర్థమవుతుంది.
కథల ఎంపికలో అంత జాగ్రత్తగా, కథనం పట్ల అంత శ్రద్ధగా ఉండే విజయ్ ఆంటోనీ తెలుగు తెర బాక్సాఫీస్ ను కొల్ల్లగొట్టడానికి మరో చిత్రంతో రెడీ అవుతున్నాడు. ఆయన తమిళం లో చేస్తున్న చిత్రం ను బేతాళుడు పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ బేతాళుడు ఆడియో ఈనెల 6న విడుదల కాబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే సినిమా కూడా వస్తుందని అనుకోవచ్చు. కొంచెం అతిశయోక్తి లాగా ఉంటుంది గానీ.. బేతాళుడు వచ్చే సమయానికి మనవాళ్లు పట్టుదలకు పోయి పెద్ద సినిమాలు తేకుండా ఉంటే మంచిది.

