బరువు అంటేనే భయపడుతుంది!!

పైన చెప్పిన టైటిల్ చూస్తుంటే బరువు అంటే భయపడేది అనుష్క అనుకుంటున్నారా? కాదుకానీ.. నిజంగానే అనుష్క బరువు అంటే భయపడుతుంది. ఎందుకంటే ఆమె 'సైజ్ జీరో' సినిమా కోసం బాగా బరువు పెరిగి సమస్యల్లో పడింది. ఆ తర్వాత ఆ బరువును కరిగించడానికి అనుష్క చాలా కష్టపడింది కానీ అనుకున్న సైజ్ లోకి రాలేకపోయింది. అందుకే 'బాహుబలి 2 ' లో బాగా లావుగా వున్న అనుష్కని చూసాం. ఇక అనుష్క కూడా చీరలతో మానేజ్ చేసినా ఆమె బరువు ఆమెకు కాస్త అటంకంగానే మారిందనే చెప్పాలి. ఇక అనుష్క పడుతున్న కష్టం చూసి అలా అంటుందో లేకపోతె మారేదన్న కారణమో గాని బరువు అని పేరెత్తగానే హీరోయిన్ కీర్తి సురేష్ ఉలిక్కిపడింది.
'మహానటి సావిత్రి'లో టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తి సురేష్ సావిత్రి పాత్ర కోసం కాస్త బరువుపెరిగితే బావుంటుందని చిత్ర యూనిట్ కీర్తిని అడిగినట్లు ప్రచారం జరిగింది.. ఇప్పటికే కొంచెం బొద్దుగుమ్మలా వుండే కీర్తి ఇంకొంచెం బరువు పెరిగితే సావిత్రి నిండైన పాత్రకి సరిగ్గా సరిపోతుందని అనుకున్నారట. మరి సావిత్రి కోసం బరువుపెరిగితే మిగతా సినిమాల పరిస్థితి ఏమిటనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ సినిమా సహా వేరే కమిట్మెంట్లు చాలా ఉన్న కీర్తి.. బరువు పెరిగితే ఇబ్బందే కదా.
ఇక కీర్తి నే సావిత్రి’ కోసం బరువు పెరిగే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అని ప్రశ్నించగా... బరువు పెరిగే ప్రయత్నాలేమీ చెయ్యడం లేదుగాని ప్రస్తుతానికి బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నాని క్లారిటీ ఇచ్చేసింది. ఒక్క సావిత్రి కోసం బరువు పెరిగితే ఇతర సినిమాల పరిస్థితి ఏమిటని అంటుంది. మరి సన్నగా ఉంటే సావిత్రి పాత్రకి సెట్ కారేమో అని అడగ్గా.. దానికి కీర్తి ప్రోస్తెటిక్ మేకప్‌తో మేనేజ్ చేయబోతున్నట్లు చెబుతుంది. మరి ఈ మేకప్ తో సావిత్రి పాత్రకి కీర్తి ఏమాత్రం న్యాయం చేస్తుందో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడడమే మిగిలింది.

