బన్నీ రికార్డు బ్రేక్ చేసిన హాట్ యాంకర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని 50 కోట్ల క్లబ్లో చేర్చిన సూపర్ హిట్ సినిమా రేస్ గుర్రం. అల్లు అర్జున్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని సమకూర్చారు. రేస్ గుర్రం పాటలు కూడా ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. రేస్ గుర్రం పాటలు సంగీత ప్రేక్షకులు యూట్యూబ్ లోనూ అనేక మార్లు వీక్షించారు. రెండు సంవత్సరాలలో రేస్ గుర్రంలోని సినిమా చూపిస్త మామ పాటకు 1 .9 కోట్ల వ్యూస్ తో ఆన్లైన్ రికార్డు సాధించింది. అయితే ఎవరు ఊహించని విధంగా బుల్లి తెర యాంకర్ రష్మీ పాట రేస్ గుర్రం పాట రికార్డు ను అధిగమించేసింది.
అడల్ట్ కామెడీ నేపథ్యంలో వచ్చిన గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మీ గౌతమ్ హద్దులు మీరి అందాలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ రష్మీ గౌతమ్, సిద్దులు రొమాన్స్ చేసిన నీ సొంతం పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. తెలుగు సినిమా పాటల్లో నెటిజన్లు ఎక్కువగా వీక్షించిన పాట రికార్డు అల్లు అర్జున్ కి ఉంటే కేవలం ఒక సంవత్సరంలో నీ సొంతం పాట 2 .1 కోట్ల వ్యూస్ తో రేస్ గుర్రం పాట రికార్డును దాటుకుని అగ్ర స్థానం లో నిలిచింది. విపరీతంగా అందాలు ఆరబోస్తున్నా రష్మీకి బాక్స్ ఆఫీస్ విజయాలు దక్కనప్పటికీ అర్ధ నగ్న ప్రదర్శనలకు యూట్యూబ్ లో బాగా స్పందన దక్కుతుంది అనటానికి ఇది ఒక నిదర్శనం.

