బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమంట ఈ భామకు!

ఈ సమ్మర్ కి రిలీజ్ అవుతున్న సినిమాల్లో అల్లు అర్జున్ నటించినా 'నా పేరు సూర్య' సినిమా ఒకటి. ఈ సినిమాకు మంచి క్రేజ్ వుంది. ఆల్మోస్ట్ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మే 4వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతుంది. సమ్మర్ పోటీకి చాలా సినిమాలు వున్నాయి కాబ్బట్టి డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను కంప్లీట్ చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు చిత్ర బృందం. ఈ సాంగ్ లో స్వీడిష్ భామ ఎల్లి ఆరామ్ తో స్టెప్పులు వేయించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సుందరి చెప్పింది. ప్రస్తుతం క్వీన్ తెలుగు వెర్షన్ లో నటిస్తుంది ఈ అమ్మడు. స్లో సాంగ్ అంటున్న ఎల్లి ఆరామ్.. ఇదో ఫోక్ నంబర్ అని చెప్పింది.
బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టమని.. తన మూమెంట్స్ ను తెగ ఎంజాయ్ చేస్తుందట. అలానే సీటీ మార్ పాట తన ఫేవరెట్ నంబర్ అంటోంది ఎల్లి. బన్నీతో కలిసి డాన్స్ వేయడం చాలా ఆనందముగా ఉందని చెబుతుంది స్వీడిష్ భామ.

