బడ్జెట్ కి భయపడుతున్న నిర్మాతలు

శ్రీను వైట్ల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనబడటం లేదు. వరుస ప్లాప్స్ తో కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల ను రవితేజ ఆదుకోవడానికి సిద్దమయ్యాడు. ఇక రవితేజ మాత్రమే కాకుండా బడా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ వారు కూడా ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇంకేంటి శ్రీను వైట్ల కష్టాలకు ఫుల్ స్టాప్ పడిందనుకున్నారు అంతా. ఇక శ్రీను వైట్ల కూడా మైత్రి మూవీస్ నిర్మాతలతో కలిసి రవితేజ సినిమా కోసం కథ, స్క్రిప్ట్ రెడీ చేసుకోవడంలో నిమగ్నమయ్యాడు. ఇంకొద్ది రోజుల్లో రవితేజ - శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కబోయే సినిమా మొదలవుతుంది అనుకుంటుండగా ఈ సినిమాని నిర్మించే నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వెనకడుగు వేసుకున్నట్లుగా సమాచారం.
శ్రీను వైట్ల ముందు చెప్పిన బడ్జెట్ కన్నా సినిమాకి ఎక్కువ బడ్జెట్ తీసుకుంటాడని నానుడి ఉంది. శ్రీను వైట్ల - రవితేజ సినిమా కోసం కేవలం 25 కోట్ల బడ్జెట్ ని మైత్రి మూవీస్ ని అడిగాడట. మరీ ప్లాప్ డైరెక్టర్ శ్రీను వైట్లపై 25 కోట్ల బడ్జెట్ పెట్టడానికి మైత్రీ వాళ్లు ఆలోచనలో పడ్డారు. మరీ శ్రీను వైట్ల మిస్టర్ సినిమ అప్పుడు బడ్జెట్ చెప్పినదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టించాడని ప్రచారం ఉంది. మరి అప్పటి మిష్టర్ నిర్మాత అనుభవం మైత్రి వాళ్ళకి గుర్తుకు వస్తుందట. మరి 25 కోట్ల బడ్జెట్ అని చెప్పి దాన్ని ఇంకెంత పెంచేస్తాడో అని భభయపడుతున్నారట.
మరీ మైత్రి మూవీస్ వారు శ్రీను తో సినిమా అని అనౌన్స్ చేసినప్పవుడే వారికీ ఈ భయం ఉండాల్సింది. మరి అప్పుడు శ్రీను వైట్లతో సినిమా చేచేస్తామని.. ఇప్పుడు ఇలా వెనుకడుగు వేస్తుంది అంటే మాత్రం ఇది కచ్చితంగా శ్రీను వైట్ల దురదృష్టమే అనుకోవాలి. లేకపోతె అన్ని సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు ఇలా వెనకడుగు వెయ్యడం అంటే అది శ్రీను బ్యాడ్ లెక్కే

