ఫైనల్ గా సెట్ అయ్యేలానే ఉంది

స్టార్ ఫ్యామిలీ నుండి వెండితెరకు అరంగేట్రం చేసే పిల్లలంతా వేరే నిర్మాతలకు ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. మాములుగా సినిమా రంగానికి చెందిన హీరోలు వెండితెరకు పరిచయమైనా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఓన్ బ్యానర్స్ ఉంటాయి. రామానాయుడు కి సురేష్ ప్రొడక్షన్స్ ఉంది... అలాగే వెంకీ, రానాలు హీరోలుగా ఉన్నారు. ఇక అన్నపూర్ణ స్టడీస్ బ్యానర్ ఉంటే నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ లున్నారు. ఇక గీత ఆర్ట్స్ ఉంది మెగా ఫ్యామిలీ హీరోస్ కి. నందమూరి ఆర్ట్స్ బ్యానర్ ఉన్నది నందమూరి హీరోలకు. ఎటొచ్చి సొంతంగా హీరోలుగా ఎదిగినవారు కూడా మెల్లగా నిర్మాణం పై మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారిలో నాని లాంటి హీరోలున్నారు.
అయితే స్టార్ ఫామిలీస్ పిల్లలు తమ ఓన్ బ్యానర్ లోకన్నా ఇతర నిర్మాణ సంస్థలలోనే ఎక్కువగా సినిమాలు చేస్తారు. అయితే భారీ నిర్మాణ సంస్థలలో తమ సినిమాలు తేడా కొట్టినప్పుడు మాత్రమే ఓన్ బ్యానర్ లో చేసి నిలదొక్కుకుంటారు. ఇప్పుడు నాగ చైతన్య అడపా దడపా అంటే ఒకటి రెండు సినిమాలు మాత్రమే అన్నపూర్ణ స్టడీస్ లో చేసాడు. మిగతా సినిమాలన్నీ బయట బ్యానర్స్ లోనే చేసాడు. నాగ చైతన్య కి తన అన్నపూర్ణ బ్యానర్ ఉంది అలాగే తన మేనమామ సురేష్ బాబుది సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఉంది. అన్నపూర్ణ బ్యానర్ లో నటించిన నాగ చైతన్య తన మేన మామ ప్రొడక్షన్ మాత్రం సినిమాలు చెయ్యలేదు.
గతంలో వెంకటేష్ - నాగ చైతన్యలు కలిసి సినిమా చేద్దామనుకున్నా కొన్ని కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. అంతేకాదు నాగ చైతన్య ప్రస్తుత ప్రాజెక్ట్ సవ్యసాచి సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ లోనే చెయ్యాల్సి ఉంది. కానీ లాస్ట్ మినిట్ ఆ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఎలాగైనా మేనల్లుడుతో సినిమా నిర్మించాలని సురేష్ బాబు గట్టిగానే అనుకుంటున్నట్టుగా కనబడుతున్నాడు. దర్శకుడు బాబీ చెప్పిన కథ తో సురేష్ బాబు ఈ కథ నాగ చైతన్య కు సెట్ అవుతుందని అదే స్క్రిప్ట్ ను ఫైనల్ చేసినట్లు గా సమాచారం అందుతుంది.

