'పోలీసోడు' వస్తున్నాడు...!
తమిళ హీరో కార్తికి తెలుగులో ఉన్న డిమాండ్ కూడా కోలీవుడ్ స్టార్ విజయ్‌కు లేదనేది వాస్తవం. కాగా ఆయన ప్రస్తుతం 'రాజురాణి' ఫేం అట్లీకుమార్ దర్శకత్వంలో సమంత, అమీజాక్సన్, ప్రభు, రాధికా వంటి సీనియర్ నటీనటులతో నిన్నటితరం హీరోయిన్ మీనా కూతురు కీలకపాత్రను పోషిస్తున్న చిత్రం 'తేరీ'. ఈ చిత్రం ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది కానుకగా విడుదల కానుంది. కాగా విజయ్‌కు ఎప్పటినుండో తెలుగులో కూడా మార్కెట్ పెంచుకోవానే కోరిక ఉంది. కానీ ఆయన చేసిన 'తుపాకి, జిల్లా, అన్న'వంటి పలు చిత్రాలను తెలుగులోకి అనువాదం చేసినప్పటికీ తెలుగులో ఈహక్కులను పొందిన నిర్మాతలు ఆయా చిత్రాలకు సరైన పబ్లిసిటీ... ప్రమోషన్ చేయని కారణంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరకాలేకపోయాయి. అందుకే విజయ్ ఈసారి తన చిత్రాన్ని చాలా తక్కువ ధరకు దిల్‌రాజు చేతికి అందించి ఆయనపై ఉన్న భరోసాతో ధీమాగా ఉన్నాడు. కాగా ఈ చిత్రానికి 'విన్నర్' అనే టైటిల్‌ను పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది ఉట్టి పుకార్లే అని రుజువైంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు దిల్‌రాజు 'పోలీసోడు' అనే టైటిల్‌ను ఖరారుచేశాడు. మొత్తానికి ఈచిత్రంతో విజయ్‌కి తెలుగులో మొదటి హిట్ ఇచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నాడు దిల్‌రాజు. మరి విజయ్, దిల్‌రాజుల అంచనాలు నెరవేరుతాయా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది.