Mon Dec 22 2025 03:04:00 GMT+0000 (Coordinated Universal Time)
పేలవంగా వున్న కాజల్ పాట

తెలుగులో టాప్ హీరోయిన్స్ జాబితాలో గత దశాబ్ద కాలంగా పోటీలో వుంటూ నెగ్గుకొస్తుంది కాజల్ అగర్వాల్. 2007 లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ చిత్రం నుంచి కాజల్ అగర్వాల్ తార స్థాయికి చేరిపోయింది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, ప్రభాస్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, నితిన్ వంటి యంగ్ స్టార్స్ అందరితో ఇప్పటికే నటించేయగా ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ కమ్ బ్యాక్ చిత్రం ఖైదీ నెం. 150 లో చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తుంది.
ఇదంతా కాజల్ అగర్వాల్ హైప్ వైపు భాగం. కానీ హిందీ మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో కాజల్ అగ్ర శ్రేణి కథానాయికలకు ధీటుగా పోటీ ఇవ్వలేకపోయింది. తమిళంలో తుపాకీ మినహా భారీ విజయాలు ఏమి అమ్మడి ఖాతాలో లేవు. ప్రస్తుతం చిత్రాల సంఖ్య తగ్గటంతో తమిళంలో ఎప్పటి నుంచో విడుదల వాయిదా పడుతూ వస్తున్న జీవ చిత్రం కావలై వేందాం విడుదల తేదీ ప్రకటన రావటంతో ఆ చిత్రంపై ఆశలు పెంచుకుంది కాజల్. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలకు అధిక సమయమే కేటాయిస్తుంది.
ఇటీవల ఆ చిత్రంలో ని ఎం పల్స్ తీతు పూరీయే అనే పాట వీడియో సాంగ్ విడుదల కాగా ఈ పాట సంగీతం కానీ, కాజల్ చూపించిన అందాలు కానీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. జీవా కాజల్ మధ్య కెమిస్ట్రీ కూడా పేలవంగా ఉండటంతో చిత్ర విజయం పై అంచనాలు తగ్గిపోయాయి. ఈ వీడియో సాంగ్ విడుదల చేసి చిత్ర బృందం తప్పు చేసింది అనే సానుభూతి పరులు ఎక్కువ అయ్యారు ఈ చిత్రానికి.
Next Story

