పెళ్ళికి ముందే అడ్రెస్ మార్చుకున్న సమంత

తెలుగు లో తన తొలి హీరో ఐన అక్కినేని నాగ చైతన్య నే నిజ జీవిత భాగస్వామి ని చేసుకుంటుంది సమంత రుతు ప్రభు. గత కొంత కాలం క్రిందట వీరి ప్రేమాయణం బహిర్గతం కాగా అప్పటికే నాగ చైతన్య సమంతల వివాహం జరిగిపోయింది అని కూడా పుకార్లు హల్చల్ చెయ్యటంతో కింగ్ అక్కినేని నాగార్జున చొరవ తీసుకుని వివరణ ఇచ్చి ప్రచారంలో వున్న పుకార్లకు తెర దించారు. ఆ సంఘటన తరువాత నుంచి ఈ జంట చాటు మాటు వ్యవాహారాలు అంటూ ఏమి లేకుండా అన్నీ సోషల్ మీడియాలో పంచేసుకుంటున్నారు. నిన్న చైతు జన్మదినం సందర్భముగా భుజంపై చేయి వేసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది సమంత.
వీరి బహిర్గత ప్రేమ కథ లో ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ముందుగా అఖిల్ వివాహం ఉంటుందని, తరువాత చైతు వివాహం జరుగుతుంది అని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. 2017 ఆగస్టు నెలలో చైతు సమంతల పరిణయం జరిగే అవకాశం ఉండగా ఇప్పటికే సమంత తన మకాం మార్చేసింది అంట. స్వతహాగా మద్రాస్ వాసి ఐన సమంత హైద్రాబాద్ లో తనకు ఒక గెస్ట్ హౌస్ ఏర్పరుచుకుంది. ఇప్పుడు అది ఖాళీ చేసి చైతు ఎప్పటి నుంచో ఒంటరిగా నివాసం ఉంటున్న లగ్జరీ అపార్ట్మెంట్ కు మకాం మార్చేసింది అంట సమంత. అంటే చైతు సమంతలు దాదాపు తొమ్మిది నెలల సహజీవనం తరువాత పెళ్లి పీటలు ఎక్కనున్నారన్న మాట.

