పెళ్లి తర్వాత రెండేళ్లే అంటున్న హీరోయిన్

పెళ్లి తర్వాత సినిమాలలో నటించాలా.. వద్దా అనేదాని పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ సమంత. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ చైతన్య ని పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలు అయింది సమంత. అయితే పెళ్లి తర్వాత నటిస్తారా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దు గుమ్మ. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడం కొనసాగిస్తానని ఈ క్రేజీ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు అక్కినేని ఫ్యామిలీ కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో... సమంత హవా సినిమా ఇండస్ట్రీలో మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం వుంది.
అయితే పెళ్లి తర్వాత సమంత ఎంతకాలం హీరోయిన్గా కొనసాగుతుందనే విషయంలో మాత్రం ఎవరికీ అంతగా స్పష్టత లేదు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత హీరోయిన్ గా కొనసాగుతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. అయితే పెళ్లి తరువాత ఎంతకాలం సినిమాల్లో కొనసాగాలనే విషయాన్ని ఈ అందాల భామ ముందుగానే నిర్ణయించుకుందట.
ఫ్యామిలీ లైఫ్‌లోకి పూర్తి స్థాయిలో ఎంటరైతే మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమని భావించిన సమంత... పెళ్లి తరువాత రెండేళ్లు మాత్రమే సినిమాల్లో కొనసాగాలని డిసైడయ్యిందట. ఇదే విషయం గురించి అక్కినేని ఫామిలీ కి సమంత ముందుగానే చెప్పిందని.... సమంత సన్నిహితులు చెబుతున్నారు. సో.. సమంత ని తన ఫాన్స్ మరో రెండేళ్లు మాత్రమే చూసుకుంటారన్నమాట. చూద్దాం హీరోయిన్స్ ఎవరూ మాట మీద నిలబడే రకాలు కాదు. మరి సమంత విషయంలో ఈ 'మాట' అనేది ఎలా వుండబోతుందో చూద్దాం.

