Wed Dec 24 2025 20:08:23 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లి అంటే మరీ అంత మొహం మొత్తిందా బాసూ

అక్కినేని నాగేశ్వర రావు కి ఎంతో ఇష్టమైన మనవడు సుమంత్. ఇతను సినిమాల్లోకి హీరోగా వచ్చి కొన్ని సినిమాలు చేసినా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక కొంతకాలం టాలీవుడ్ కి దూరమైయ్యాడు. సుమంత్ చేసిన వాటిలో కొన్ని చిత్రాలే అతనికి కొద్దిగా పేరును తేగలిగాయి. కానీ సుమంత్ ని ఆ పేరు తెచ్చిన సినిమాలు మాత్రం హీరోగా నిలబెట్టుకోలేకపోయాయి. అప్పుడప్పుడు నేనున్నానంటూ ఎదో ఒక సినిమాతో పలకరించే సుమంత్ ఇప్పుడు మళ్ళీ నరుడా డోనరుడా అంటూ ప్రేక్షకులని పలకరించడాని సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు తన తాత లాగా, మామ లాగ సుమంత్ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. ఇక మామ నాగ్ పిల్లలు నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లో దాదాపు సెటిల్ అయిపోయారు. కానీ సుమంత్ మాత్రం ఇంతవరకు ఇక్కడ నిలబడలేక తడబడుతూనే వున్నాడు.
ఇక సుమంత్ హీరోగా మొదలు పెట్టిన తొలినాళ్లలోనే 2004 లో హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ రెండు సంవత్సరాలు గడవక ముందే వీరిద్దరూ మనస్పర్థల కారణం గా విడిపోయారు. ఇక అప్పటినుండి సుమంత్ సింగిల్ గానే ఉంటున్నాడు. మళ్ళీ పెళ్లి ఆలోచన కూడా చెయ్యలేదు. అంతే కాదు తనకి ఇక పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. పాపం తాను వివాహ బంధం లో ఎంతగా ఇబ్బందులు పడకపోతే ఇలా పెళ్లి ఆలోచనని పక్కన పెట్టేసాడు. ఇక ఇప్పటికైనా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తూ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా విక్కీ డోనర్ ని తెలుగులో నరుడా డోనరుడా గా రీమేక్ చేసాడు. మరి ఈ సినిమాతోనైనా సుమంత్ తాను అనుకున్నది సాధిస్తాడా లేక మళ్ళీ కొన్నాళ్ళు టాలీవుడ్ కి దూరమవుతాడో మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.
Next Story

