Wed Dec 24 2025 08:37:37 GMT+0000 (Coordinated Universal Time)
పూరీ-రామ్ కాంబినేషన్ సెట్ అవుతుందా?

హీరో రామ్ ఛానళ్ల తర్వాత నేను శైలజతో పర్వాలేదనిపించాడు. మళ్ళీ బాగా అలోచించి కందిరీగ వంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో హైపర్ సినిమా చేసాడు. ఇక ఈ సినిమాలో రామ్ మాత్రం సూపర్ అనిపించాడు కానీ సినిమా మాత్రం ఒకే ఒకే గా రన్ అయ్యింది. అయితే రామ్ మాత్రం ఒక సూపర్ హిట్ పడితేనే తనకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తున్నాడు. అందుకే ఈసారి ఒక గట్టి డైరెక్టర్ ని పట్టాలనుకుంటున్నాడు. అయితే ఏ స్టార్ డైరెక్టర్ రామ్ తో చేసే ఛాన్స్ లేదు గనక రామ్ ఇజం సినిమా ప్లాప్ తో డీలా పడ్డ పూరి తో చెయ్యాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక పూరి తో సినిమా చేస్తే బై ఛాన్స్ హిట్ కొట్టెయ్యచ్చని రామ్ ప్లాన్.
ఇక పూరి జగన్నాథ్ కూడా లోఫర్ తో, కళ్యాణ్ రామ్ ఇజం తో చేతులు కాల్చుకుని కూర్చున్నాడు. ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాక కూడా ఏ స్టార్ హీరో అయినా అవకాశం ఇస్తాడేమో అని తెగ ఎదురు చూసాడు. కానీ పూరీని స్టార్ హీరోలు పక్కన పెట్టేసారు. అందుకే పూరి వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాడు. అంటే ఎదో ఒక కుర్ర హీరోతో సినిమా చేసి హిట్ కొట్టాలనే కసిగా కనబడుతున్నాడు. అందుకే హీరో రామ్ తో సినిమా చేయడానికి పూరి కూడా సుముఖం గా ఉన్నాడనే వార్తలు వినబడుతున్నాయి. ఇక రామ్ - పూరి డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతుందని ప్రచారం కూడా మొదలైంది. మరి ప్రచారం జరుగుతుంది గాని ఇంకా అధికారికం గా మాత్రం ప్రకటన రాలేదు.
Next Story

