పాప్ కార్న్ విక్రయిస్తున్న సూపర్ స్టార్ శ్రీమతి

ఇప్పుడు అనేకమంది యువ నటీనటులు సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు కానీ, నిర్మాతలకు సూపర్ స్టార్ అంటే మాత్రం క్రిష్ణ గారే. దీనికి కారణం ఆయన యవ్వన దశలో ఏడాదికి డజను పైగా చిత్రాలలో నటిస్తూ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ నిర్మాతలకు చిత్రాలు చెయ్యటమే. ఆయన రోజుకి మూడు వివిధ షిఫ్టులుగా దాదాపు పద్దెనిమిది గంటలు చిత్రీకరణలకు కేటాయించేవారు. ఆయన నట వారసుడిగా నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడు ఐన తరువాత క్రమంగా చిత్రాలు తగ్గించి ఇప్పుడు విశ్రాన్త జీవితాన్ని గడుపుతున్నారు.
సూపర్ స్టార్ క్రిష్ణ గారి శ్రీమతి విజయ నిర్మల మాత్రం హైదరాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో పాప్ కార్న్ అమ్ముకుంటుంది. అయితే ఇది వృత్తి రీత్యా కాదండోయ్.. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం అనే బుల్లి తెర కార్యక్రమానికి అతిధిగా ఈ వారం విజయ నిర్మల విచ్చేసారు. సామాన్య ప్రజలలో నిస్సహాయ స్థితిలో వున్న వారి కుటుంబాలకు చేయూతనిచ్చే సద్దుదేశంతో సినీ ప్రముఖులు ఈ కార్య్రక్రమంలో పాల్గొని తోచిన విధంగా సహాయపడటం తెలిసిందే. ఈ వారం తన వంతుగా పాప్ కార్న్ విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అవసరంలో వున్న వారికి అందచేయనున్నారు విజయ నిర్మల.
ఈ శనివారం రాత్రి 08:30 కి జెమినీ తేలేవిజిన్లో విజయ నిర్మల అతిధిగా విచ్చేసిన మేము సైతం ఎపిసోడ్ ప్రాసరం కానుంది.

