పాపం బాగా అప్సెట్ అయ్యాడే!!

'బెంగాల్ టైగర్' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈఏడాది మొదట్లోనే రెండు సినిమాలను ఒకే టైం లో మొదలు పెట్టాడు మాస్ మహారాజ్ రవితేజ. ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమా అయితే.. రెండోది లక్ష్మినరసింహా ప్రొడక్షన్ బ్యానర్‌పై విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమా. ఈ రెండు సినిమాలను ఏకకాలంలోనే మొదలు పెట్టిన రవితేజ మొదటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమా ని ఫినిష్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర షూటింగ్ చాలా స్పీడుగా సాగుతుందట.
అయితే రవితేజ, అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న సినిమా నుండి వీలున్నప్పుడల్లా విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేసే ‘టచ్ చేసి చూడు’ సినిమా షూటింగ్ స్పాట్ కి జంప్ అవుతున్నాడట. అయితే ‘టచ్ చేసి చూడు’ షూటింగ్ చాలా స్లో గా జరుగుతుందట. కారణం విక్రమ్ సిరికొండ మంచి స్టోరీ రైటర్. రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన విక్రమ్ సిరికొండ డైరెక్షన్ మీద పెద్దగా పట్టు లేకపోవడంతో తీసిన సీన్స్ నే మళ్ళీ మళ్ళీ తీస్తూ రవితేజకు చికాకు తెప్పిస్తున్నాడట. మరి విక్రమ్ సిరికొండ ఇలా షూటింగ్ విషయంలో జాప్యం చేస్తూ కొన్ని సీన్స్ ని రీషూట్ చెయ్యడంతో విసుగు చెందిన రవితేజ కొన్నిరోజులు షూటింగ్ కి రాకుండా మానేసాడట.
విక్రమ్ సిరికొండ మీద నమ్మకంతో.. అతను చెప్పిన స్టోరీ లైన్ కి ఇంప్రెస్స్ అవ్వబట్టే తాను పిలిచి డైరెక్టర్ అవకాశం ఇచ్చానని... విక్రమ్ ఇలా చేస్తాడని అనుకోలేదని రవితేజ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. అయితే తోటి నటీనటులు, నిర్మాతలు రవితేజను కన్విన్స్ చేసి మళ్లీ ‘టచ్ చేసి చూడు’ సెట్స్ పైకి తీసుకొచ్చారట.

