పాపం తమ్మూని చూస్తే జాలేస్తుంది!!

బాహుబలితో.. ఆ సినిమాలో నటించిన అందరికి జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పటికీ... పార్ట్ వన్ లో కీ రోల్ చేసి, పార్ట్ టు లో ఎవ్వరూ గుర్తు పట్టలేని పాత్రలో కనబడిన తమన్నా కి ఆ సినిమా వల్ల ఎటువంటి కీర్తి ప్రతిష్టలు రాలేదు సరికదా.... అసలు సినిమాల్లో అవకాశాలే లేకుండా పోయాయి. ఇప్పటివరకు ఒకటి అరా సినిమా అవకాశాలతో బిజీగా వున్నా తమన్నా ఒక్కసారిగా ఖాళీ అయ్యింది. అయితే ఎన్టీఆర్ మీదున్న స్నేహంతో జై లవ కుశ లో ఐటెం సాంగ్ చెయ్యడానికి ఒప్పుకుంది. ఇక స్వింగ్ జరా అంటూ ఆ పాటలో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. కానీ జై లవ కుశ మొత్తం పాటల్లోకెల్లా ఆ పాట వినడానికి బావున్నా.. తమన్నా ఎక్సప్రెషన్స్, ఆమె అందాల ఆరబోత, ఆ సాంగ్ లో తమ్ము డ్రెస్సెన్స్ అవన్నీ కూడా ఎన్టీఆర్ ఫాన్స్ కి గాని సగటు ప్రేక్షకుడికి గాని అస్సలు రుచించలేదు. దెబ్బకి తమన్నా డాన్స్ కి జై లవ కుశలో నెగెటివ్ పాయింట్స్ పడిపోయాయి.
గ్లామర్ గా కన్పించినా.....
ఆ పాటలో తమన్నా డాన్స్ అస్సలు బాగోలేదని... పాట వింటున్నప్పుడు పర్వాలేదనిపించినా... దాన్ని తమ్ము డాన్స్ తో వింటుంటే మాత్రం చిరాకు పుట్టిందంటున్నారు. తమన్నా గ్లామర్ గా కనపడినప్పటికీ.... ఆమె వీక్ పెరఫార్మెన్సు తో అందరిని డిస్పాయింట్ చేసిందంటున్నారు. అసలు అన్నం తినేటప్పుడు పంటి కింద రాయి పడితే... ఎలాంటి ఫీలింగ్ వస్తుందో.. జై లవ కుశలో తమన్నా డాన్స్ అలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా చేసిన పెరఫార్మన్స్ కన్నా జనతా గ్యారేజ్ లోని కాజల్ పెరఫార్మెన్సు మాత్రం అదిరిందంటున్నారు. మరి స్వింగ్ జరా తో స్వింగ్ చేద్దామనుకున్న తమన్నాకి ఈ ఐటెం పాటతో మొదటికే మోసం వచ్చింది అంటున్నారు. ఇక తమన్నాకి సినీపరిశ్రమలో అవకాశాల మాటేమో గాని ఆ పాటతో తమ్ము ఇమేజ్ చాలా డ్యామేజ్ అయ్యిందని టాక్ మాత్రం గట్టిగా వినబడుతుంది. మరి ప్రస్తుతానికి తమన్నా చేతిలో బాలీవుడ్ క్వీన్ రీమేక్ క్వీన్ తప్ప మారేది లేదు. చూద్దాం తమ్ము సినీ భవిష్యత్తు ఎలా వుడ్నబోతుందో కాలమే నిర్ణయిస్తుంది.
- Tags
- తమన్నా

