పాప అంతా పవన్ లాగే ఉందిట!

రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి చాలా కాలమే అయ్యింది. పవన్ విడిపోయాక రేణు తన ఇద్దరి పిల్లలతో ఒంటరిగానే ఉంటుంది. ఏదో అప్పుడప్పుడు పవన్ పిల్లల్ని కలవడానికి వెళుతూ ఉంటాడని చెబుతుంటారుగాని...అలా వెళ్లిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పాలి. అయినా రేణు, పవన్ తో విడిపోయాక కూడా పవన్ ని తెగ పొగుడుతూ కాలక్షేపం చేసేస్తుంది. ఏ ఫెస్టివల్ వచ్చినా ఆ పండగని బాగా సెలెబ్రేట్ చేసి తనతో పాటు తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇదిగో చూడండి పవన్ పిల్లల్ని అంటూ చూపిస్తుంది. పవన్ నుండి విడిపోయేటప్పటికీ అకీరా, ఆధ్య లు కొంచెం చిన్న పిల్లలే. ఇప్పుడు వారు పెరిగి పెద్దవారవుతున్నారు. ఇక రేణు దేశాయ్ దీపావళి ఫెస్టివల్ కి పెట్టిన ఫొటోస్ లో ఆధ్య, అకీరాలు బాగా పెద్దవారైపోయారు. ఇక రేణు అలా పోస్ట్ చేసిందో లేదో తెగ లైక్స్, కామెంట్స్ వర్షం కురిపించేస్తున్నారు జనాలు. మరి పవన్ పిల్లలంటే ఆషామాషీనా... అందులోను పవన్ కూతురు ఆధ్య అచ్చం తండ్రి పవన్ లాగే ఉందనే కామెంట్స్ పడిపోతున్నాయి.

