పాత రోజుల్ని గుర్తు చేస్తున్న సమంత

ఒకరి జీవితం గురించి తెలుసుకోవాలంటే మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందులో సినిమా వాళ్ళ లైఫ్ గురించి అంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి అలనాటి నటి అందాల జాబిలి సావిత్రి జీవిత చరిత్రను తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఆ కాలంలో షూటింగ్ లు ఎలా జరిగేవి. అసలు వాతావరణం ఎలా ఉండేది అనే విషయం అప్పటి వారికీ తప్ప ఇప్పటివారికి తెలియదు. కానీ అటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు డైరెక్టర్. ప్రస్తుత రోజుల్లో సినిమా తీయడం చాలా ఈజీగా మారింది. కానీ అప్పట్లో సినిమా తీయాలంటే చాలానే కష్టపడేవారు. మాగ్జిమమ్ అంతా సింగల్ టేక్ ఆర్టిస్ట్ లే ఉండేవారు. సింగల్ టేక్ లో షూట్ ఒకే అవ్వకపోతే రెండో సారి తీయాలంటే చాలా ఖర్చు అయ్యేది.
ఇకపోతే ఆ విషయాలను మహానటి సినిమాలో మనం చూడవచ్చు.. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతి ఫ్రెమ్ లో బ్లాక్ అండ్ వైట్ రోజులను కళ్లముందు చూపించడానికి వర్క్ చేస్తున్నాడు. సినిమాలో వాడిన లూనా ను సమంత తన సోషల్ మీడియా మీడియా పేజ్ లో అప్లోడ్ చేసింది. ఈ కొత్త బండి ఎలా ఉందొ చెప్పండి అని సమంత తన అనుభూతిని తెలియజేసింది. ఇక ఈ సినిమా సావిత్రి పాత్ర కీర్తి సురేష్ చేస్తుంది. జమున గారి పాత్రలో సమంత కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ నెలలో రానుంది.

