పాజిటివ్ టాక్ లేకుండా ఏం ఆడుతుందండి ?

తమిళంలో రజినీకాంత్ అల్లుడుగా కాకుండా తనకంటూ ఒక స్టార్ స్టేటస్ ఏర్పరుచుకుని స్టార్ హీరోగా వెలిగిపోతున్నాడు ధనుష్. మామకు తగ్గ అల్లుడుగా ధనుష్ మంచి పేరే తెచ్చుకున్నాడు. మధ్యలో సుచి లీక్స్ వంటి ప్రకంపనలతో కాస్త డిస్టర్బ్ అయినా కూడా తన తాజా చిత్రం 'విఐపి 2 ' పనులతో బిజీగా వున్న ధనుష్ ఆ చిత్రానికి కథ మాటలు అందించడమే కాకుండా హీరోగానూ చేసాడు. ఆయన మరదలు సౌందర్య స్వయంగా దర్శకత్వం చేసిన ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత కూడా. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజోల్ విలన్ గా కూడా నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ గత శుక్రవారమే విడుదలైంది.
అయితే ఎన్నో అంచనాల మధ్యన విడుదలైన ఈ చిత్రం నెగెటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు క్రిటిక్స్ నుండి కూడా నెగెటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. విఐపీ 1 తో బంపర్ హిట్ కొట్టిన ధనుష్ ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ విఐపి 2 చేసి చేతులు కాల్చుకున్నాడంటున్నారు. విఐపి 1 లోలాగా హీరోయిన్ అమల పాల్ తో ఈ విఐపి 2 లో రొమాన్స్ అంతగా పండలేదని..... అలాగే విఐపి లో ఉద్యోగం కోసం తిరిగే ఇంజినీరింగ్ కుర్రాడిలా ఆకట్టుకున్నాడు. కానీ ఈ చిత్రంలో రోజువారీ ఉద్యోగస్తుడిగా ధనుష్ మెప్పించలేకపోయాడనే కామెంట్స్ కూడా పడుతున్నాయి.
ఇకపోతే బాలీవుడ్ నటి కాజోల్ కూడా ఈ చిత్రానికి ఏమాత్రం హెల్ప్ కాలేదని కూడా అంటున్నారు. ముఖ్యంగా సౌందర్య రజనీకాంత్ స్క్రీన్ ప్లే- డైరెక్షన్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే టాక్ మాత్రం బలంగా వినబడుతుంది. ఓవరాల్ గా ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదని పెదవి విరుస్తున్నారు. మరి అక్కడ ప్లాప్ టాక్ తెచ్చుకున్న విఐపి 2 ఇక్కడ తెలుగులో కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరి అక్కడ బెడిసికొట్టిన ఆ సినిమా ఇక్కడైనా సక్సెస్ సాధిస్తుందటారా? చూద్దాం.

