Mon Dec 08 2025 14:00:30 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పక్కన ఆమె.... నిజమేనా...!

అఖిల్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సాయేషా గుర్తుండే ఉంటుంది. నాగార్జున వారసుడు అయిన అఖిల్ పక్కన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో పాతుకుపోదామని ప్లాన్ చేసిన ఈ అమ్మడు అఖిల్ చిత్రం ఘోరమైన ప్లాప్ అవ్వడం తో మళ్ళీ టాలీవుడ్ లో ఎక్కడా కనబడలేదు. ఇక ఈ అమ్మాయికి తెలుగులో మళ్ళీ ఛాన్స్ వస్తుందా అనుకున్న టైమ్ లో సాయేషా మళ్ళీ ఇప్పుడు వార్తల్లోకొచ్చింది. ఆ వార్త అలాంటి ఇలాంటి వార్త కాదు. ఆ వార్త ఏమిటంటే సాయేషా సైగల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఛాన్స్ కొట్టేసిందట. మరి టాలీవుడ్ లో రెండో సినిమానే పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన సాయేషా మాములు అదృష్టవంతురాలు కాదు అని అప్పుడే కామెంట్స్ మొదలయ్యాయి.
ఏ.ఎం రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడునేషన్ తెరకెక్కించే చిత్రంలో పవన్ పక్కన సాయేషాని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అని చెబుతున్నారు. అయితే ఈ చిత్రం లో పవన్ కి చెల్లెలిగా రక్షిత నటిస్తున్న విషయం తెలిసిందే. మరి నిజంగా సాయేషాకి పవన్ పక్కన నిజంగా ఛాన్స్ దక్కితే గనక ఆమె చాలా లక్కీ అనే చెప్పాలి.
Next Story

