పవన్ నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పుతాడా?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో హారిక అండ హాసిని ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తుంది. అను ఇమ్మాన్యువెల్, కీర్తి సురేష్, ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి వంటి నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లేటప్పుడే 90 నుండి 100 కోట్లు బడ్జెట్ అనుకున్నారట. కానీ ఇప్పుడు అదికాస్తా త్రివిక్రమ్ వలన 120 కోట్లదాకా వెళ్లిందని టాక్ వినబడుతుంది.
మరి సినిమాకి ఆ రేంజ్ బడ్జెట్ ఎక్కితే అమ్మకం కూడా అదే రేంజ్ లో ఉండాలిగా. అందుకే ఈ చిత్ర నిర్మాతలు బయ్యర్స్ తో బేరసారాల్లో ఉన్నారట. దాదాపు 150 కోట్ల వరకు ఈ చిత్రంపై కోటు చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. మరి ఆ రేంజ్ లో బేరం పెడితే కొనడానికి ఎగురుకుంటూ వచ్చేయ్యారు కదా. అందుకే వారు కూడా ఈ సినిమాపై అంత పెట్టేందుకు కొద్దిగా ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం త్రివిక్రమ్, పవన్ కి క్రేజ్ ని బట్టి ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా లేదన్న 80 - 90 కోట్ల రేంజ్ లో అమ్మకాలు సాగించి నాన్ బాహుబలి రికార్డుల్లో టాప్ 1 లో కూర్చోవాలని ఆరాటపడుతున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ చిత్ర బిజినెస్ ఫలానా ఏరియా ఇంత, అంత అనడమే కానీ ఫిక్స్ అయింది లేదని సమాచారం అందుతుంది. మరి ఇప్పటివరకు 100 కోట్ల బిజినెస్ జరిగింది అని చెప్పింది అంతా రూమరేనన్నమాట. మరి చిత్ర యూనిట్ భావించినట్టుగా పవన్ నాన్ బాహుబలి రికార్డు నెలకొల్పుతాడో లేదో వెయిట్ అండ్ సి.

