పవన్ కు మరో హీరోయిన్ మద్దతు

ప్రముఖ నటుడు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో హీరోయిన్ మద్దతు లభించింది. గతంలో కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ పై చేసినా వ్యాఖ్యలుకు హీరోయిన్ పూనమ్ కౌర్.. పవన్ కు మద్దతుగా నిలిచినా సంగతి తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా ‘నచ్చావులే’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన మాధవీలత తన పేస్ బుక్ ద్వారా పవన్ కు మద్దతు తెలిపింది. " పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టమని గత పదేళ్లుగా ప్రతి ఇంటర్వ్యూ లో చెప్పుకుంటూ వస్తున్నా. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టం అందుకే నేను ‘నక్షత్ర ఫౌండేషన్’ను ప్రారంభించాను.
కానీ ఎవరి సపోర్ట్ లేక..ఫండ్స్ లేక అది బ్రేక్ పడింది. కానీ సేవ చేయాలనీ ఆశ మాత్రం చావలేదు. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టి ప్రజలకు ఏదో చేయాలి అనుకుంటున్నప్పుడు నేను ఆయనికు ఎందుకు సపోర్ట్ చేయకూడదు?? అనిపిస్తోంది. పవన్ కోసం నేను ఏదైనా చేస్తా" అంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేసింది మాధవీలత.

