పవన్ ఎందుకు సిగ్గుపడుతున్నాడు!

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఎలా వుండబోతున్నాడో.. అనేది చిత్ర బృందం విడుదల చేసిన పవన్ పోస్టర్ తోపాటు... అనిరుధ్ పాడిన ఒక పాటను కూడా విడుదల చేసింది. అయితే సినిమా మొదలుపెట్టి ఆరు నెలలు గడుస్తున్నా.. సినిమాకి సంబందించిన వివరాలను కేవలం పవన్ పుట్టిన రోజు సందర్భంగా మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం... అసలు సినిమా పేరుని విడుదల చెయ్యకుండా ఇంకా సస్పెన్స్ లోనే కొట్టుకునేలా చేసింది.
అయితే హారిక మరియు హాసిని క్రియేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ విడుదల చెయ్యకుండా సినిమాని మాత్రం వచ్చే ఏడాది జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే చిత్ర బృందం విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ అలా ఏడారిలో నడుచుకుంటూ.. వెళుతున్నాడు. ఇక దాన్ని చూసాకా పవన్ కొత్త సినిమా టైటిల్ 'బహుదూరపు బాటసారి' అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ పవన్ సినిమా పాటతో కూడిన టీజర్ చూసాక మాత్రం పవన్ 'అజ్ఞాతవాసి' అంటున్నారు.
అంటే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా టైటిల్ గా 'అజ్ఞాతవాసి' అంటూ మెగా ఫాన్స్ ఫిక్స్ అవడమేకాదు..... పవన్ 25 వ సినిమా టైటిల్ మాత్రం 'అజ్ఞాతవాసి' అని చిత్ర బృందం కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిజమెంతో తెలియదు గాని ఈ టైటిల్ మాత్రం చాలా బావుందని.... త్రివిక్రమ్ ఎంతగా ఆలోచింది ఇంత లోతైన టైటిల్ పెట్టాడని అంటున్నారు. చూద్దాం చిత్ర బృందం పక్కా అధికారిక ప్రకటన చేసే వరకు దీని నిజమని నమ్మడానికి లేదు.

