పవన్ అంటేనే రికార్డు

ఈ మద్యన ఏదైనా సినిమా ఆడియో ని డైరెక్ట్ గా మర్కెట్ లోకి వదలడమే... లేకుంటే ఒక్కో సాంగ్ ని విడుదల చెయ్యడమో... అది కాకపోతే ఆడియో వేడుక నిర్వహించి పాటలను విడుదల చెయ్యడమో జరుగుతుంది. అలా విడుదలయిన పాటలు నేరుగా యూట్యూబ్ లో జ్యూక్ బాక్స్ ద్వారా వచ్చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఈ పాటలు అలా అలా యూత్ కి చేరిపోతున్నాయి. గతంలో అయితే ఆడియో వేడుక నిర్వహించి ఆ పాటలను సీడి, క్యాసెట్ ల రూపంలో బయటికి వచ్చేయి. అలా వచ్చిన సీడి లను మార్కెట్ లోకి వదిలితే ఆయా సంస్థలకు బోలెడు డబ్బు గిట్టుబాటయ్యేది. అందుకే ఆడియో రైట్స్ దక్కించుకోవడానికి చాలా కంపెనీలు పోటీ పడేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
అయితే తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడియో రైట్స్ విషయంలో కొత్త రికార్డులు సెట్ చేసి... ట్రెండ్ సెట్ చేస్తుందంటున్నారు. అదే సినిమానో కాదు... పవన్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి. ఈ సినిమా పాటల వేడుక డిసెంబర్ లో జరగబోతుంది. అయితే ఈ సినిమా ఆడియో హక్కుల కోసం ఒక ప్రముఖ కంపెనీ ఏకంగా 2 కోట్ల రూపాయలను చెల్లించిందనే విషయం ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. మరి ప్రస్తుతం శాటిలైట్ హక్కుల విషయంలోనే రికార్డు క్రియేట్ చేసిన అజ్ఞాతవాసి ఇప్పుడు ఆడియో హక్కుల విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేసిందంటున్నారు.
మరి అనిరుద్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆడియో రైట్స్ ఇలా రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయంటే.. ఈసినిమాపై ఎలాంటి అంచనాలున్నాయి అనే విషయం పూర్తిగా అర్ధమవుతుంది. మరి అజ్ఞాతవాసి ఆడియో కే ఇలాంటి టాక్ ఉంటే.. సినిమా బిజినెస్ ఏ లెక్కన ఉంటుందో చూడండి. ఏది ఏమైనా త్రివిక్రమ్ - పవన్ సినిమా మీద మాత్రం భారీస్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 10 న విడుదలకాబోతుంది.

