పరిగెట్టిస్తున్నారుగా

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం జయ జానకి నాయక ఆగష్టు లో విడుదలై యావరేజ్ హిట్ అయ్యింది. బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన జయ జానకి నాయక మాస్ ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసింది. జయ జానకి నాయక అలా విడుదలయ్యిందో లేదో.... శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం సినిమాని పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమా షూటింగ్ కూడా అప్పుడే సగం పైనే పూర్తయ్యిందని టాక్ వినబడుతుంది. ఈ సినిమా ఇప్పటికే వారణాసి, పొల్లాచ్చి వంటి లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకుని తాజాగా బళ్లారిలో భారీ, కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దీంతో సగం పైగా చిత్రీకరణ ముగిసింది.
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సాక్ష్యం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది అని తెలుస్తుంది. సినిమా కథ మొత్తం ప్రకృతిలోని పంచభూతాలైన గాలి, నీరు, భూమి, ఆకాశం, నిప్పు వంటి ఐదు అంశాల చుట్టూనే తిరుగుతుందట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
2018 ప్రధమార్ధంలో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

