పద్మావతి వస్తే బంద్ చేస్తాం!!

పద్మావతి చిత్రం పై వివాదాలు ఆగడం లేదు.. సినిమా షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండీ ఈ చిత్రం ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటుంది. తాజాగా ఈ చిత్ర విడుదలను ఆపాలని చూస్తున్న రాజపుత్ సంఘానికి చెందిన కర్ణిసేన సంఘం సభ్యులు పద్మావతి చిత్రం విడుదలయ్యే డిసెంబర్ 1న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. చిత్ర విడుదలను ఆపాలని రాజస్థాన్ లోని కోటాలోని ఆకాష్ మాల్ లో పలువురు థియేటర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగుర్ని అరెస్ట్ చేసి, పలు వాహనాలను సీజ్ చేశారు.
నిజాలను వక్రీకరించారని....
చరిత్రలోని నిజాలను వక్రీకరించి ఈ చిత్రాన్ని దర్శకుడు సంజయ్ లీల బన్సాలి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని....పద్మావతి – అలావుద్దీన్ ఖిల్జీ పాత్రల మధ్య అశ్లీల సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఈ విషయం పై స్పందించి తమ చిత్రంలో అశ్లీల సన్నివేశాలు లేవని.... తాము ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని లిఖితపూర్వకంగా లేఖను ఇచ్చిన సంజయ్ లీలా భన్సాలీ, ఇటీవలే వీడియోను కూడా విడుదల చేశాడు. అయినా కూడా పద్మావతి పై వారి కడుపు మంట చల్లారడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పద్మావతి చిత్రాన్ని డిసెంబర్ 3 న విడుదల కానివ్వబోమని భీష్మించుకు కూర్చున్నారు. అందుకే సినిమా విడుదల రోజున భారత్ బంద్ కి పిలుపునిచ్చారు.
- Tags
- పద్మావతి సినిమా

