Thu Mar 26 2026 04:26:41 GMT+0530 (India Standard Time)
నేను అందుకే జోక్యం చేసుకోను - శ్రుతి హాసన్!!

సౌత్ లో ఒక ఊపు ఊపి బాలీవుడ్ కి చెక్కేసింది శ్రుతి హాసన్. ఆమె తెలుగులోను, తమిళ్ లోను చాలానే సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె దృష్టంతా బాలీవుడ్ పైనే వుంది. లేటెస్ట్ గా శ్రుతి హాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పింది.
నేను చేసిన సినిమాలలో కొన్ని హిట్స్ వున్నాయి అలానే ఫ్లోప్స్ కూడా వున్నాయి. ఈ రెండిటి నుండి నేను కొన్ని అనుభవాలను నేర్చుకున్నాను. కొన్ని సినిమాలు పాత్రలు ఇష్టపడి చేస్తే కొన్ని సినిమాలు కొన్ని పరిస్థితుల కారణంగా చేయవలసి వచ్చింది. డైరెక్టర్ ఒక సీన్ గురించి చెప్పుతున్నపుడు..ఈ సీన్ మరోలా తీస్తే బాగుంటది కదా అని అనిపించినా సందర్భాలు చాలానే వున్నాయి.
కానీ నేను ఎప్పుడు ఆలా డైరెక్టర్ కి చెప్పలేదు. ఎందుకంటే దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సినిమా ప్లాప్ అయితే ఫస్ట్ అనేది డైరెక్టర్ నే. సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ డైరెక్టర్ కె ఇవ్వాలి అని నా అభిప్రాయం". అంటూ శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.
- Tags
- శ్రుతి హాసన్
Next Story

