Thu Dec 18 2025 16:55:33 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మాతలను ‘వైట్ వాష్’ చేసేస్తున్న నాయిక

నయనతార తమిళంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె అక్కడ దాదాపు మూడు కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ టాప్ పొజిషన్ లో మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. వయసు మీద పడుతున్నప్పటికీ గ్లామర్ పరంగా నయన్ కుర్ర హీరోయిన్స్ కి దడ పుట్టిస్తుంది. ఇక నయనతార తమిళంలోనే కాదు తెలుగులో కూడా పెద్ద హీరోయిన్. తెలుగులో అడపాదడపా సినిమాలు ఒప్పుకుంటున్నా... తమిళంలో మాత్రం తీరిక లేకుండా గడుపుతుంది. ఇక కెరీర్ పరంగా బిజీగా వున్నట్టే ప్రేమలో కూడా నయన్ ఎప్పుడూ బిజీనే.
రీల్ లైఫ్ లోఒడిదుడుకులున్నట్టే రియల్ లైఫ్ లోను ఎత్తుపల్లాలు చవి చూసిన నయనతారకు కొత్తగా ఒక సమస్య వచ్చిందట. ఇప్పటి వరకు కోలీవుడ్ లో 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని టాప్ లో వున్న నయన్... అంత మొత్తం లో ఎక్కువగా బ్లాక్ మనీ రూపంలోనే తీసుకునేది. కానీ ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు దెబ్బకి ఆ బ్లాక్ మనీ ని సదరు ప్రొడ్యూసర్స్ కి ఇచ్చేసి తన రెమ్యునరేషన్ అంతా వైట్ లోకి మార్చి ఇమ్మని కండిషన్స్ పెడుతుందట. మరి అంత పెద్ద మొత్తాన్ని వైట్ లో ఇవ్వాలంటే ప్రొడ్యూసర్స్ కి సాధ్యమయ్యే పని కాదు. అందుకే నయనతారని తన సినిమాల నుండి తప్పించి వేరే హీరోయిన్ ని తీసుకుని నయన్ డిమాండ్స్ కి చెక్ పెట్టాలని చూస్తున్నారట.
అంతటితో ఆగకుండా నయనతార మీద ఏసిబి రైడ్స్ జరిపినుంచి ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మరి నయన్ ప్రొడ్యూసర్స్ దెబ్బకి దిగివచ్చి రెమ్యునరేషన్ తగ్గిస్తుందా..... లేక నిర్మాతలు ఇచ్చింది తీసుకుని కామ్ గా వెళుతుందా అని కోలీవుడ్ మీడియాలో ఒకటే చర్చ.
Next Story

