Sat Dec 27 2025 03:44:26 GMT+0000 (Coordinated Universal Time)
నిబంధలను సడలించిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి మరో చిత్రానికి మధ్య చర్చల దశలో ఎక్కువ సమయం గడిపేస్తుంటారు. దానికి తోడు ఇప్పుడు జనసేన పార్టీ అధినేతగా అదనపు బాధ్యత కూడా ఉండటంతో తక్కువ నిడివిలో కనిపించే గోపాల గోపాల చిత్రం తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు పదిహేను మాసాలు పట్టింది. అయితే ఆ చిత్రానికి సంపంత్ నంది ని మార్చి పవర్ బాబీ ని దర్శకుడిగా ఎంచుకోవటం, ఛాయాగ్రాహకులు ఒకరికి ఇద్దరు మారటం, పవన్ కళ్యాణ్ తానే స్వయంగా కథ కథనాల బాధ్యతలు చేపట్టటం ఇలా అనేకానేక కారణాలు ఆ చిత్ర చిత్రీకరణను ఆలస్యం చేశాయి.
సర్దార్ గబ్బర్ సింగ్ వైఫల్యం చెందిన తరువాత కూడా తదుపరి చిత్రం కాటమరాయుడు పట్టాలు ఎక్కటానికి చాలా కాలం పట్టింది. అనేక మంది దర్శకులు రావటం చిత్రం అధికారిక ప్రకటన వెలువడక ముందే తప్పుకోవటం జరుగుతుండేది. ఎట్టకేలకు కాటమరాయుడు చిత్రీకరణ మొదలై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ సారి పవన్ కళ్యాణ్ ఒక చిత్రం చిత్రీకరణ దశలోనే మరో చిత్రం ప్రకటించాడు. తన తదుపరి చిత్రంగా కూడా తమిళ రీమేక్ ఎంచుకున్నాడు పవర్ స్టార్.
ఇది ఇలా ఉంటే, పవర్ స్టార్ సెట్స్ లో కేవలం చిత్రీకరణలో పాల్గొనటం తప్ప అక్కడికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగటం లాంటి వాటికి దూరంగా వుండే వాడు. కానీ కాటమరాయుడు సెట్స్ కి కలవటానికి వస్తున్న అభిమానులని వెనక్కి పంపకుండా, పలకరించి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి తరువాత సాగనంపుతున్నాడు అంట. ఏమిటో పవర్ స్టార్ లో అకస్మాత్తు గా ఈ మార్పు?
Next Story

