నితిన్ కి పద్మావతి సెట్ అయ్యిందా?

దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగేశ్న శతమానంభవతి హిట్ తర్వాత శ్రీనివాస కళ్యాణం అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ శ్రీనివాస కళ్యాణం సినిమాని దిల్ రాజు అటు రామ్ చరణ్, మహేష్ బాబు లను సంప్రదించగా వారు కాదన్నారని, చివరకి సతీష్ వేగేశ్న శ్రీనివాస కళ్యాణం కథతో దిల్ రాజు చొరవతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అయినా తెరకెక్కించాలని ఎన్టీఆర్ కి కథ వినిపించినా... ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోయేసరికి దిల్ రాజు గారు నితిన్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకుడిగా శ్రీనివాస కల్యాణాన్ని రెడీ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
అయితే స్టార్ హీరోలతో ఈ సినిమా చెయ్యాలనే దిల్ రాజు కలలు కన్నాడు కానీ అది వర్కౌట్ కాక యంగ్ హీరో నితిన్ కి కమిట్ అయ్యాడు. అతిత్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో నితిన్ కి జోడిగా అప్పుడే హీరోయిన్ ని ఫైనల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు దువ్వాడ జగన్నాధంతో గ్లామర్ పరం గా రెచ్చిపోయిన పూజ హెగ్డే ని శ్రీనివాసుడి కి హీరోయిన్ గా సెట్ చేశారనే న్యూస్ వినబడుతుంది. మరి శ్రీనివాస కల్యాణంలో శ్రీనివాసుడు నితిన్ అయితే పద్మావతి పూజ హెగ్డే అంటున్నారు. అయితే ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లుగా చెబుతున్నారు.
మరి పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మిక్కిజె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాలో పద్మావతిగా పూజ హెగ్డే ఎలా ఆకట్టుకుందో ఏమో గాని.. ఆమె మొదటి సినిమా ముకుందా లో మాత్రం లంగాఓణీలతో ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది.

