నిజంగానే ఈ డేట్ కి వస్తాడా..?

గోపీచంద్ తాజా చిత్రం 'గౌతం నందా' ఈ నెలలోనే విడుదల చేస్తామని చెబుతున్నారు. కానీ అలాంటి కార్యక్రమాలేమి ఈ చిత్రానికి ఇంకా మొదలవ్వలేదని అంటున్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ చిత్రంలో గోపీచంద్, హన్సిక, కేథరిన్ లు నటిస్తున్నారు. మొన్నటికిమొన్న ఫస్ట్ లుక్ టీజర్ తో ఆకట్టుకున్న 'గౌతమ్ నందా' ఇప్పుడు థియేట్రికల్ ట్రయిలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. మరి ఇదంతా బాగానే వుంది. కానీ ఇపుడు 'గౌతమ్ నందా' చిత్రం విడుదల డేట్ పై కాస్త సస్పెన్స్ నెలకొంది అంటున్నారు.
మరి గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నిర్మాతలు 30 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. కానీ ఇప్పుడు గోపీచంద్ పరిస్థితి టాలీవుడ్ లో ఏమాత్రం బాగోలేదు. గోపీచంద్ గత చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' విడుదలకు నోచుకోకుండా ఇంకా అలానే వుంది. అయితే గోపీచంద్ మీద నిర్మాతలు అంతగా ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఈ చిత్ర డైరెక్టర్ సంపత్ నంది అంటున్నారు. సంపత్ నంది గత చిత్రం 'బెంగాల్ టైగర్ హిట్' కావడం ఆ చిత్రానికి మంచి వసూళ్లు రావడంతో ఇప్పుడు గోపీచంద్ చిత్రానికి ఏకంగా 30 కోట్లు ఇన్వెస్ట్ చేశారట నిర్మాతలు.
మరి ఇప్పుడున్న పాజిటివ్ టాక్ తో అనుకున్న టైం కి సినిమా విడుదల కాకపోతే గనక సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమాకున్న క్రేజ్ తగ్గుతుందని... సో అనుకున్న టైం కే అంటే జులై 7 కల్లా సినిమాని సెన్సార్ కి పంపిన్చేసి ఎట్టిపరిస్థితుల్లో సినిమాని జులై 14 కల్లా బరిలో నిలపాలని సంపత్ నంది టీమ్ కంకణం కట్టుకుందట. అయినా సినిమా విడుదల డేట్ పక్కాగా అనౌన్స్ చేసి పోస్టర్స్ వదిలేవరకు డౌటే అంటున్నారు.

