నిజంగా అవమానించి నట్టేనా?

'గౌతమీపుత్ర' తెరకెక్కుతున్న రోజుల్లో బాలకృష్ణ తన 101 వ సినిమా కృష్ణ వంశి డైరెక్షన్ లో 'రైతు' గా వుండబోతుందంటూ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా 'రైతు' కథలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఒక కీ రోల్ చేస్తే సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుందని భావించి బాలకృష్ణ, కృష్ణవంశీ లు అమితాబ్ ని కలవడానికి ముంబై వెళ్లారు. అయితే అక్కడ అమితాబ్ తనకి ఈ సినిమా చెయ్యాలనే ఉంది... కానీ నాకు మరో ఆరు నెలలు ఖాళీ లేదని చెప్పడంతో చేసేది లేక బాలకృష్ణ, కృష్ణవంశీలు ఆ రైతు ప్రాజెక్టు ని పక్కన పెట్టేసారు. మరి ఆరు నెలలు ఆగలేక బాలకృష్ణ 101 వ సినిమాని పూరి డైరెక్షన్ లో 'పైసా వసూల్' మొదలు పెట్టడము... పూర్తి చెయ్యడము జరిగిపోయాయి. పోనీ ఇప్పుడైనా 'రైతు' మొదలెడతారనుకుంటే ఈసారి కృష్ణ వంశి మీదున్న భయంతో బాలయ్య 102 వ సినిమాని రవికుమార్ డైరెక్షన్ లో మొదలెట్టేసాడు. అలా అమితాబ్ వలన 'రైతు' ఆగిపోయిందనేది జగమెరిగిన సత్యం.
అయితే ఇప్పుడు తాజాగా అమితాబచ్చన్, చిరంజీవి 151 వ సినిమా 'సై రా నరసింహారెడ్డి' లో ఒక కీ రోల్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. 'సై రా' టీం కూడా ఆ విషయాన్నీ ఆఫీసియల్ గా ప్రకటించేసింది. అదిగో అక్కడే ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదేమిటంటే అమితాబ్, బాలకృష్ణ ని అవమానించాడు అని. 'రైతు' సినిమాలో డైరెక్ట్ గా చెయ్యను అని చెప్పలేక ఆరు నెలలు ఖాళీ లేదని చెప్పడంతోనే ఆ సినిమాని ఆపెయ్యాల్సి వచ్చిందని బాలయ్య, కృష్ణ వంశీలు చెబుతున్న మాట. మరి అలా బాలయ్యకి నో చెప్పిన అమితాబ్ ఇప్పుడు చిరుకి ఒకే చెప్పడంపై నందమూరి అభిమానులు అవమానంగా ఫీల్ అవుతున్నారు.
అయితే వారు అవమానంగా ఫీల్ అవడం చూస్తుంటే వారికి ఒక క్లారిటీ ఇవ్వాలనిపిస్తుంది అంటున్నారు కొందరు. అదేమిటంటే అమితాబ్ 'రైతు' లో చెయ్యనని చెప్పలేదు. కేవలం ఆరునెలలు ఖాళీ లేదని మాత్రమే చెప్పాడు. మరి ఆరు నెలలు ఆగలేక అప్రాజెక్టు ని బాలయ్య, కృష్ణ వంశిలే పక్కన పడేసారు. మరి ఇప్పుడు ఆ ఆరు నెలల టైం పూర్తవడంతోనే అమితాబ్ ఇప్పుడు చిరు సినిమాకి ఎస్ చెప్పాడు. మరి బాలయ్య వాళ్ళు ఆరు నెలలు వెయిట్ చేస్తే అమితాబ్, బాలయ్య సినిమాలో నటించేవాడేమో. కానీ ఇప్పుడు చిరు సినిమాకి ఎస్ చెప్పగానే అవమానం అంటూ బయలు దేరారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

