నానిపై అఖిల్ గెలిచే అవకాశముంది

ఈ ఏడాది దిల్ రాజుకి భలే కలిసొచ్చింధనే చెప్పాలి. అతను తీసిన ప్రతి సినిమా హిట్ అయ్యి లాభాలు కూడా అందించాయి. డిజె, రాజా ది గ్రేట్ చిత్రాలతో బయ్యర్లకి స్వల్ప నష్టాలు వచ్చినప్పటికీ దిల్ రాజుపై అవి అంత ప్రభావం చూపలేదు.
మొత్తం ఐదు సినిమాలు తీసి మంచి ఫామ్ లో ఉన్న దిల్ రాజు తన ఆరో సినిమాపై కూడా అదే ధీమాతో ఉన్నాడు. అతని బ్యానర్ లో వస్తున్న ఆరో సినిమా ఎంసిఏ. డిజె, రాజా ది గ్రేట్ సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు వేరే సినిమాలు ఏం లేకపోవడంతో ఆ సినిమాలు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ అవి దిల్ రాజు ను గట్టెక్కించాయి. మరి ఎంసిఏ తో పాటు ఇప్పుడు అఖిల్ సినిమా హలో పోటీ లో ఉండంతో ఈ సినిమాపై ఎక్సపెక్టషన్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి.
ప్రమోషన్ల దగ్గర్నుంచి ప్రోమోల వరకు, ఆడియో దగ్గర్నుంచి సినిమాకున్న క్రేజ్ వరకు హలో.. ఎంసీఏ ని డామినేట్ చేస్తోంది. సాంగ్స్, ట్రైలర్ ఎంసిఏ కంటే హలో నే బాగున్నాయి. హలో ట్రైలర్ చూస్తేనే ఆ మేకింగ్ గాని, సాంగ్స్ గాని, టేకింగ్ గాని విక్రమ్ ఏ రేంజ్ లో తీసాడో చెప్పక్కర్లేదు. మరి అంత హైప్ ఉన్న ఈ సినిమా ముందు ఎంసిఏ తట్టుకుంటాడో లేదో చూడాలి. హలో అంచనాలని అందుకోవడంలో విఫలమయితే తప్ప ఈ రొటీన్ మిడిల్ క్లాస్ అబ్బాయికి ప్రేక్షకాదరణ కష్టం కావచ్చు.

