నాని హీరోయిన్ ఈమేనా..?

నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వరుసగా ఏడు హిట్స్ అందుకుని సూపర్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ మీదుండగానే మరో సినిమాతో లైన్లోకొచ్చేస్తున్నాడు. తాజాగా 'నిన్ను కోరి'తో హిట్టందుకున్న నాని ఈ సినిమా విడుదల కాకముందునుండే 'ఎంసీఏ' సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయాడు. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా... ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల తేదీ కూడా ప్రకటించాడు. మరి ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకముందే మరో సినిమాని లైన్ లో పెట్టాడు నాని.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున' అనే సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని కూడా వదిలేసాడు. ఇందులో నాని రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. లవ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో నాని సరసన 'ప్రేమమ్, అ...ఆ' ఫెమ్ అనుపమ పరామేశ్వరన్ నటిస్తుందని వార్తలు ప్రచారంలోకొచ్చాయి. 'కృష్ణార్జున' లో నాని , అనుపమ ల మధ్య మంచి ప్రేమ కథ సాగుతుందని..... అనుపమ పాత్ర ఈ చిత్రంలో చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.
అతి త్వరలోనే సెట్స్ మీదకెళ్లనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. సూపర్ స్పీడులో దూసుకుపోతున్న నాని ఈ రెండు చిత్రాలతో కూడా హిట్ కొట్టేస్తాడమేమో అంటున్నారు.

