నాని - నాగ్ అప్పుడే సెట్స్ మీదకెళ్ళేది

వరుస విజయాలతో ఊపుమీదున్న నాని ప్రస్తుతం ‘ఎంసిఏ’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 21న నాని నటించిన ‘ఎంసిఏ’ విడుదల కానుంది. ఇకపోతే నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. అంతే కాకుండా నాని నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక నాని మేర్లపాక గాంధీ 'కృష్ణార్జున యుద్ధం' మూవీ తరువాత నాని, నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ లో నటించనున్నాడు అన్న విషయం తెలిసిందే.
అయితే నాగార్జున కూడా తన కొడుకు అఖిల్ నటించిన 'హలో' ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఆ సినిమా కూడా ఈ నెల 22 నే విడుదలకు సిద్దమవవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత నాగ్, వర్మ డైరెక్షన్ లో మూవీ తోపాటు.. నానితో పాటే మల్టీస్టారర్ లో నటిస్తాడు. ఈ చిత్రానికి శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం పై అశ్వినిదత్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

