నాని ఈసారి ఈ యువ దర్శకుడితో?

హీరో నాని వరుసగా హిట్స్ సాధిస్తూ సినిమాల మీద సినిమాలు చేస్తూ తన వేగాన్ని అందుకోవడం ఎవరివల్ల కాదని యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు.ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వం లో MCA చిత్రాన్ని దాదాపు కంప్లీట్ చేసిన నాని... ఆ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ లో విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. MCA సినిమా తో పాటే మేర్లపాక గాంధీ దర్శకత్వం లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాని కూడా లైన్ లో పెట్టాడు నాని. ఇలా ఈ రెండు సినిమాలతో బిజీ గా ఉంటూనే ఇప్పుడు ఇంకో సినిమాని ఒప్పుకున్నాడు నాని. నేను శైలజ సినిమాతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకుని ఇప్పుడు రామ్ హీరోగా ఉన్నది ఒకటే జిందగీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న యువ దర్శకుడు కిషోర్ తిరుమల నానితో సినిమా చేయబోతున్నాడు అని సమాచారం.
నాని తో కిషోర్ తిరుమల సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందట. శ్రీమంతుడు, జనత గ్యారేజ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు సెన్సిబుల్ ప్రేమకథలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల.... నానితో ఎలాంటి సినిమాని తెరకేక్కిస్తాడు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాని కూడా చేతిలో ఉన్న MCA ని విడుదల చేసి... ఆతర్వాత కృష్ణార్జున యుద్దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి కిషోర్ సినిమా కోసం రెడీ అవుతాడంటున్నారు.

