Wed Mar 25 2026 02:01:10 GMT+0530 (India Standard Time)
నాని - అవసరాల సినిమా ఒకే అయిందా??

అష్టా చమ్మా నుండి నాని - అవసరాల శ్రీనివాస్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. నాని వరస విజయాలతో దూసుకుపోతూ లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు. ఇక శ్రీనివాస్ అవసరాల తన నటనను కొనసాగిస్తూ డైరెక్షన్ కూడా చేసి శభాష్ అనిపించుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం అవసరాల డైరెక్షన్ లో నాని ఓ సినిమా చేయనున్నాడట.
ఆ సినిమాల తర్వాత....
ఈ సినిమాకు నాని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో నాని ఓ మల్టీ స్టారర్ చేయనున్నాడు. ఆ తర్వాత హను డైరెక్షన్ లో ఇంకో సినిమా చేయనున్నాడు. గతంలోనే ఈ కథను ఒకే అనుకున్నారట. బహుశా ఈ రెండు సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వుండే అవకాశంవుందని చెబుతున్నారు. ఇలా నాని ఫుల్ బిజీగా ఉండటం వల్లనే 'సీటీమార్' చేయాలనుకున్న మారుతి .. బన్నీపై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
- Tags
- నాని
Next Story

