నాచురల్ స్టార్ ధైర్యానికి హాట్స్ ఆఫ్

సంక్రాంతి పండుగ సందర్భముగా వచ్చిన చిత్రాల ఫలితాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే బహిరంగంగా వీటి పై మాట్లాడటానికి ఎవరూ ముందుకి రారు. ముఖ్యం సినిమా పరిశ్రమకి చెందిన సెలబ్రిటీస్ ఒక చిత్ర విజయానికి అభినందనలు తెలపటానికి ముందు వుంటారు తప్పితే పరాజయం పొందిన చిత్రం పై అనవసర కామెంట్స్ చెయ్యరు. అజ్ఞ్యాతవాసి డిసాస్టర్ కావటంతో గ్యాంగ్, జై సింహ లు మోస్తరు ఫలితాన్ని అందుకుని యావరేజ్ చిత్రాలుగా నిలిచాయి. పోటీ వాతావరణం భావించిన హీరో అభిమానులు మాత్రం 2018 తొలి హిట్ అంటూ జై సింహ ని ప్రమోట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇంకా బ్రేక్ ఈవెన్ కాని ఈ చిత్రం ఓవర్ ఆల్ థియేట్రికల్ రైట్స్ పరిగణిస్తే మాత్రం హిట్ అనే చెప్పాలి.
భాగమతి ప్రీ రిలీజ్ వేడుకకి అతిధిగా హాజరైన నాచురల్ స్టార్ నాని సంక్రాంతి పండుగకి వచ్చిన చిత్రాలలో హిట్ చిత్రమేది లేదని సూచన ప్రాయంగా చెప్పటం విశేషం. 2018 తొలి సాలిడ్ హిట్ ని భాగమతి ద్వారా స్వీటీ (అనుష్క) ఇస్తుందని తాను నమ్ముతున్నట్టు వేదికపై చెప్పాడు నాని. బాల కృష్ణ వంటి అగ్ర హీరోల చిత్ర ఫలితంపై ప్రభావం చూపే ఇలాంటి పరోక్ష వ్యాఖ్య చేయటానికైనా సినిమా పరిశ్రమ వ్యక్తులకి చాలా ధైర్యం ఉండాలి. కానీ వాస్తవం ఏంటో అందరికి తెలుసు కాబట్టి నాని తాను అనుకున్నదే స్పష్టంగా భాగమతి ప్రీ రిలీజ్ వేదికపై నుంచి తెలియజేశాడు. 2018 కి నిజమైన తొలి సాలిడ్ హిట్ భాగమతి అవుతుంది అన్న నాని మాటలు నిజమవుతాయో లేదో చూడాలి.

