Sat May 18 2024 19:51:01 GMT+0000 (Coordinated Universal Time)
నాగ్ సినిమా వదులుకున్నందుకు ఛాన్సులు మిస్సయ్యాయి
పాటలకు స్వరాలూ సమకూర్చటంలో మెలోడీ గీతాలకు ఎక్కువ పాపులర్ ఐన కళ్యాణ్ మాలిక్ అలియాస్ కళ్యాణ్ కోడూరి నేపధ్య సంగీతం లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు. చేసినవి తక్కువ చిత్రాలే అయినా వాటిల్లో పెద్ద హీరోలకు స్వరాలూ అందించాడు. నందమూరి బాల కృష్ణ నటించిన అధినాయకుడు చిత్రానికి, అక్కినేని నాగార్జున నటించిన బాస్ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీత దర్శకుడు. కాగా ఈ రెండు చిత్రాల సంగీతం విషయం పక్కనపెడితే చిత్ర ఫలితాలు అంచనాలు తప్పిన చిత్రాలే కావటంతో ఆయా చిత్రాలకు పని చేసిన సాంకేతిక నిపుణులకు రావాల్సిన గుర్తింపు రాలేదు.
బాస్ చిత్రం నిరాశపరిచినప్పటికీ కింగ్ నాగార్జున కళ్యాణ్ మాలిక్ కి తన తదుపరి చిత్రాలలో ఒక చిత్రానికి అవకాశం కలిపించారు అంట. బాస్ చిత్రం కన్నా కూడా ఆ చిత్రం కళ్యాణ్ మాలిక్ వృత్తిపరమైన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టింది అని స్వయంగా కళ్యాణ్ మాలిక్ చెప్పటం గమనార్హం. ప్రతిభ కనపరుస్తున్నా తన సమకాలీన సంగీత దర్శకులకు పోటీ ఇవ్వలేకపోవటానికి కారణాలు ఆయన దగ్గర ఆరా తీయగా, "బాస్ చిత్రం తరువాత మరో చిత్రానికి నాగార్జున అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి నేను చేసిన ఐదు పాటలూ చిత్ర దర్శకుడికి నచ్చకపోవటంతో నేను ఆ చిత్రం నుంచి తప్పుకున్నాను. నాగ్ చిత్రం వదులుకుని వచ్చేశాడు అంటూ దాదాపు ఏడాదిన్నర నాకు ఎవరూ అవకాశం ఇవ్వలేదు. నేను ఇప్పటికి వరుసగా చిత్రాలు చెయ్యలేకపోవటానికి ఇది ఒక కారణం." అని వాపోయాడు కళ్యాణ్ మాలిక్.
Next Story