నాగ్ - వర్మ మూవీ టైటిల్?

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఫిలిం పది రోజుల మొదటి షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కోసం ముంబై చెక్కెయ్యడానికి హీరో నాగార్జున కోసం వెయిట్ చేస్తుంది. నాగ్ అఖిల్ హలో ఫిలిం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో వర్మ సినిమా షూటింగ్ కి కొంతమేర బ్రేక్ ఇచ్చాడు. శివ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇండస్ట్రీకి అందించిన ఈ కాంబినేషన్ మరలా రిపీట్ అవడంతో ఈ మూవీ కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. మాఫియా బ్యాక్డ్రోప్ తో తెరకెక్కించనున్న ఈ మూవీలో నాగార్జున సరసన మైరా సరీన్ అనే కొత్తహీరోయిన్ ని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించాడు వర్మ.
ఇకపోతే వర్మ - నాగ్ సినిమాకి ఇప్పటివరకు టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యలేదు. అయితే ఇప్పడు ఈ మూవీకి వర్మ రెండు టైటిల్స్ ని అనుకుంటున్నట్టుగా మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ రెండు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ని వర్మ ఇప్పటికే రిజిస్టర్ చేయించాడు కూడా. అయితే ఆ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఏమిటంటే.. ఒకటి గన్, రెండు సిస్టమ్ అనే టైటిల్స్ ని వర్మ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. అయితే చిత్ర బృందం నుండి అందుతున్న సమాచారం ప్రకారం వర్మ - నాగ్ మూవీకి సిస్టమ్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు.
చిత్ర కథకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే టైటిల్ సిస్టమ్ అని.. అందుకే వర్మ కూడా ఆ టైటిల్ కె మొగ్గు చూపుతున్నాడని టాక్. చూద్దాం ఫైనల్ గా నాగార్జున సినిమాకి వర్మ ఏ టైటిల్ ని తీసుకుంటాడో?

