నాగ్ కన్ఫర్మ్ చేసాడు...కానీ నానినే

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్ శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్, నాని లు మల్టి స్టారర్ చేయబోతున్నట్లుగా ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం పై ప్రొడ్యూసర్ అశ్వనిదత్ తోపాటు హీరో నాగార్జున ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక కింగ్ నాగార్జున ఈ మల్టీస్టారర్ చిత్రంపై స్పందిస్తూ నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చేస్తున్నానని.... శ్రీ రామ్ ఆదిత్య చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు నాగార్జున చెబుతున్నాడు.
అయితే ఈ మల్టీస్టారర్ సినిమాలో నాని పాత్ర మాత్రం ఫుల్ ఫన్ జెనరేట్ చేసే పాత్ర చేస్తున్నాడని.... నాని తో నటించడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు నాగ్. అలాగే ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య భలే మంచి రోజు తో మంచి హిట్ కొట్టి....శమంతకమణి తో కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ ని తెరకెక్కించి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి రెండు సినిమాలకే ఈ సారి ఏకంగా నేచురల్ స్టార్ నానితో ఇంకా నాగార్జునతో భారీ స్థాయిలో మల్టీ స్టారర్ ని సెట్ చేసేసాడు.
మరి శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించే ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఫిదా చేస్తుందో చూడాలి. ఇకపోతే ఎటువంటి సినిమా ఒప్పుకోకుండా నాగ్ అయితే ఈ మల్టీస్టారర్ చెయ్యడానికి రెడీగానే వున్నాడుగాని.... నాని మాత్రం ప్రస్తుతం చేస్తున్న ఎంసీఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాల నుంచి ఫ్రీ అయ్యాక ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది.

